ఏపీ ఎన్నికల్లో వైసీపీపై ప్రజాశాంతి ఎఫెక్ట్ ఉంటుందా ... ? మీ కామెంట్ ఏంటీ ?
ఆంధ్రప్రదేశ్ లో జరగతున్న కీలక ఎన్నికల్లో గుర్తులు అభ్యర్థుల పేర్లు ఓటర్లను కన్ఫ్యూజ్ చేయనున్నాయా ? వైసీపి గుర్తు ఫ్యాన్ కాగా, ఫ్యాన్ తో పోలిన కేఏపాల్ ప్రజాశాంతీ పార్టీ హెలీకాప్టర్ గుర్తుతో రంగంలోకి దిగింది. . దీంతోపాటు ఆపార్టీ జెండా రంగు కూడా వైసీపితో పోలి ఉంది.మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థుల పేర్లు సైతం ఒకే విధంగా ఉన్నాయి. దీంతో తమపై కుట్ర జరుగుతుందంటూ ప్రజాశాంతీ పార్టీపై వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే సమయం మించి పోవడంతో తాము ఏమి చేయలేమని ఎన్నికల కమీషన్ తేల్చి చెప్పింది. అయితే ఇది వైసీపీ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ? వైసీపీ అధినేత జగన్ ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని మీరు నమ్ముతున్నారా, సో దీనిపై మీ కామెంట్ ను పెట్టండి













Click it and Unblock the Notifications