ఏపీ గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల

అమరావతి: రెవెన్యూ శాఖలో గ్రూప్-4 ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ నియామకాల కోసం జులై 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది హాజరు కాగా, 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు అధికారులు తెలిపాు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

రెవెన్యూ శాఖలో గ్రూప్-4 ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ నియామకాల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 Andhra Pradesh group-4 junior assistant screening test results released

ఏపీ హైకోర్టులో పలు ఉద్యోగాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 76 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:
డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత.

వయో పరిమితి:
01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రా(అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 22, 2022.

మరిన్ని వివరాల కోసం https://hc.ap.nic.in/ ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+