AP TET 2024 : సెప్టెంబ‌ర్ 22 త‌ర్వాత ఏపీ టెట్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల‌...

టెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్షకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన స‌మ‌చారం అందింది. సెప్టెంబ‌ర్ 22 త‌ర్వాత టెట్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వ‌హ‌ణ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

ఏపీ టెట్‌కు ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌కు మొత్తం 4,27,300 మంది అప్ల‌య్‌ చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్‌జిటి) పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది అప్ల‌య్ చేసుకోగా, సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్ఎ) పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది అభ్య‌ర్థులు అప్ల‌య్ చేసుకున్నారు. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

AP TET 2024 AP TET Hall Tickets Release After 22nd September

18 రోజుల‌పాటు ప‌రీక్ష‌లు..

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 (జులై) పరీక్షలకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లు సిబిటి విధానంలో జ‌ర‌గ‌నున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున సుమారు 18 రోజుల పాటు టెట్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రుగుతుంది. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యింది. టెట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లు వ‌చ్చే నెల 22 తర్వాత అందుబాటులో రానున్నట్లు ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. వీటి ప్రాథ‌మిక కీలు పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అక్టోబర్ 4 నుంచి విడుదల కానున్నాయి. ప్రాథ‌మిక కీల‌పై అభ్యంత‌రాల‌ను అక్టోబర్ 5వ తేది నుంచి స్వీకరిస్తారు. టెట్ ప‌రీక్ష ఫైన‌ల్ కీ అక్టోబర్‌ 27వ తేదీ విడుదల అవుతుంది. నవంబర్‌ 2న టెట్‌ ఫలితాలను విడుద‌ల చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+