Appsc : గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్... మెయిన్స్ పరీక్ష తేది వచ్చేసింది!
ఏపీలోని గ్రూప్ 2 అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేది వచ్చేసింది. జూలై 28న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కూడా కమిషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 10వ తేదీ న ఫలితాలు విడుదల అయ్యాయి. 1:100 నిష్పత్తిలో ప్రిలిమ్స్ పరీక్షల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92,250మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. తాజాగా మెయిన్స్ పరీక్ష సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను ఏపీపీఎస్సీ అందించింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను జూలై 28న నిర్వహించే ఆలోచనలో ఉంది.
జూలై 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్ను పేపర్) విధానంలో ఉంటుంది. మెయిన్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది హాజరవుతారు. మొత్తం 899 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 5 నుంచి 18వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టు ప్రాధాన్యత, జోనల్/జిల్లా ప్రాధాన్యతలను వెబ్ ఆప్షన్లలో సమర్పించాలని ఏపీపీఎస్సీ సూచించింది.

గ్రూప్ 2 పోస్టులు..
ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 4 గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు , 16 గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 28 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులతో పాటు.. 59 ప్రభుత్వ శాఖల్లోని 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో), సీనియర్ ఆడిటర్, ఆడి టర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్ల లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి.
ఈ పోస్టులకు జూలై 28న మెయిన్స్ పరీక్ష జరగనుంది.












Click it and Unblock the Notifications