నర్సింగ్ విద్యార్థులకు ఎపిఎస్‌ఎస్‌డిసి బంపర్ ఆఫర్...
విదేశాలలో ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడాలని నేటి తరం యువత కలలు కంటున్నారు. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి వారికోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ గొప్ప అవకాశం కల్పించింది. నర్సింగ్ కోర్సు చేయదలచిన అభ్యర్థులకు విదేశాలలో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను అందించేందుకు ముందుకు వచ్చింది. మరెందుకాలస్యం ఆ వివరాలను తెలుసుకుందాం.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నర్సింగ్ కోర్సు చేయదలచిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ కోర్సులు చేసి విదేశాల్లో ఉద్యోగాలు సంపాందించాలనుకునేవారికి శిక్షణ ఇచ్చి సహకరిస్తున్నట్లు తెలిపింది. నిన్న (ఫిబ్రవరి 4) గుంటూరు వైద్య కళాశాలలో నిర్వహించిన ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్‌ఏఐ) రాష్ట్ర శాఖ సదస్సుకు ఎపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో, ఎండీ వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీలోని ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

తిరుపతిలో యూనివర్సీటి...
నర్సింగ్ కోర్సులు పూర్తిచేసి జర్మనీ, జపాన్ లాంటి విదేశాలలో ఉద్యోగాలకు వెళ్లాలనుకునేవారి కలలను సాకారం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని గుర్తుచేశారు. విదేశాలలో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. వైద్య రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడేందుకు ఇది గొప్ప అవకాశంగా అభివర్ణించారు.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే తిరుపతిలో యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యూనివర్సీటీ రాష్ట్రంలోని ఎందరో నర్సింగ్ అభ్యర్థులకు కేంద్రబిందువుగా మారనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనివర్సీటీలో విదేశాల్లో పనిచేసేందుకు అవసరమైన అన్ని మెళకువలను శిక్షణ ద్వారా అందజేయనున్నట్లు వెల్లడించారు. నర్సింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపే విద్యార్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అందిస్తోన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications