బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బంపర్ ఆఫర్.. రూ.93,960 జీతంతో జాబ్స్ !
నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సువర్ణావకాశం అందించింది. దేశవ్యాప్తంగా జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్-II) పోస్టుల కోసం మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోని ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవచ్చు.
ఖాళీలు & కేటగిరీ వారీ వివరాలు..
ఈ నియామకంలో మొత్తం 500 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్సీ కేటగిరీకి 75 పోస్టులు, ఎస్టీకి 37 పోస్టులు, ఓబీసీకి 135 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కు 50 పోస్టులు, యూఆర్ కేటగిరీకి 203 పోస్టులు కేటాయించారు. అదనంగా 20 పోస్టులు దివ్యాంగుల కోటాలో ఉన్నాయి.

విద్యార్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సరిపోతాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా బ్యాంకింగ్ అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, సీఏఐఐబీ సర్టిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
వయస్సు పరిమితి & సడలింపులు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వబడుతుంది.
వేతన వివరాలు..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు ప్రాథమిక వేతనం చెల్లించబడుతుంది. అదనంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర భత్యాలు కూడా అందించబడతాయి.
ఎంపిక విధానం..
ఈ నియామకంలో అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కుల పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. అనంతరం 100 మార్కుల ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ.1,180గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల కేటగిరీలకు ఫీజు రూ.118 మాత్రమే.
ఈ ఉద్యోగాలకు నేటి ( ఆగస్టు 13, 2025) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఆగస్టు 30, 2025.
దరఖాస్తు విధానం..
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. అన్ని వివరాలను సరిచూసుకుని మాత్రమే సమర్పించాలి.
అభ్యర్థులకు సూచనలు..
- దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
- పరీక్షలో విజయవంతం కావడానికి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నపత్రాలు & మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.
- నిర్ణిత సమయంలోపు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications