ఈరోజే ఇరాన్ తో బిగ్ డీల్.. దాడులు చేసుకోవద్దు: ట్రంప్ సంచలనం

అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికే ఒక కీలక శాంతి ఒప్పందంపై సంతకాలు జరగాల్సిన వేళ.. లెబనాన్ రాజధాని బీరుట్‌ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన.. ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఎంతో దగ్గరగా ఉన్న తరుణంలో ఈ అనాలోచిత దాడి జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలు తక్షణమే సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పదునైన వ్యాఖ్యలు చేశారు. "మనం ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే ఒప్పందానికి అత్యంత సమీపంలో ఉన్నాం. లెబనాన్‌ తో సహా అన్ని పక్షాలు వెనక్కి తగ్గాలి" అని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని వదులుకోవద్దని హెచ్చరిస్తూ.. "ఇది సుదీర్ఘమైన, అందమైన శాంతికి ఆరంభం కావచ్చు . దీనిని పాడుచేసుకోవద్దు..!" అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులకు స్పందన అత్యంత పరిమితంగానే ఉందని, దీనివల్ల ముఖ్యమైన శాంతి చర్చల ప్రక్రియ దెబ్బతినకూడదని అన్నారు.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై సందేహాలు

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ ఇజ్రాయెల్ దాడులపై తీవ్రంగా స్పందిస్తూ.. అమెరికా విశ్వసనీయతను బహిరంగంగా శంకించారు. తమ అణు కార్యక్రమం వైపు చర్చలు సాగుతుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడం దారుణమన్నారు. బీరుట్‌ లోని దహియే ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ముగ్గురు మరణించారు. హెజ్బుల్లా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నప్పటికీ, ఇది ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు ఒక వ్యూహాత్మక పరీక్షగా నిలిచింది.

పాకిస్థాన్ డిజిటల్ మధ్యవర్తిత్వంతో ఆదివారం నాడే శాంతి ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ మాత్రం ఇందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చని పేర్కొన్నారు. ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిని తెరవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం, తక్షణమే యుద్ధాన్ని ముగించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. వివాదాస్పద అణు కార్యక్రమం, నిలిపివేసిన ఇరాన్ ఆస్తుల పునరుద్ధరణ మరియు ఆంక్షల సడలింపు వంటి అంశాలపై సంతకాల అనంతరం 60 రోజుల్లోగా చర్చించనున్నారు.

Trump Condemns Israel s Beirut Airstrikes at Critical Time of USIran Peace Negotiations DonaldTrump

బరాక్ ఒబామా కీలక విమర్శలు

మరోవైపు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఒప్పందంపై పెదవి విరిచారు. 2015లో కుదిరిన చారిత్రక అణు ఒప్పందాన్ని (జేసీపీఓఏ) మించిన మెరుగైన ఫలితాలను ట్రంప్ సాధించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. "మొదట కుదుర్చుకున్న ఒప్పందం కంటే భిన్నమైన లేదా మెరుగైన శాంతి ఒప్పందం వచ్చే అవకాశం లేదు" అని.. "మనం బెదిరింపులు లేదా బాంబుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోలేము" అని ఒబామా పేర్కొన్నారు. తాజా పరిణామాలు శాంతి స్థాపన ప్రయత్నాలకు తీవ్ర సవాలుగా పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసేలా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+