Budget 2026: కొత్త ఉద్యోగాల కల్పన, విద్యారంగంలో మార్పులు!
భారతదేశం ఇప్పుడు యువశక్తితో ఉప్పొంగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుండగా, ఈ యువతే దేశ ఆర్థిక వృద్ధికి అసలైన శక్తిగా మారుతోంది. అయితే ఈ శక్తిని సరైన దిశలో వినియోగించుకోగలిగితేనే అభివృద్ధి సాధ్యం. కేవలం డిగ్రీలు చేతిలో ఉండటం సరిపోదు... ఉద్యోగాలకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలు కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే బడ్జెట్ 2026పై విద్యా రంగం భారీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పటివరకు బడ్జెట్‌లో విద్యకు సంబంధించిన కేటాయింపులు ఎక్కువగా కాలేజీ భవనాలు, అడ్మిషన్ల సంఖ్య, మౌలిక సదుపాయాల చుట్టూనే తిరిగాయని నిపుణుల విమర్శ. కానీ ఈసారి ఆ దృక్పథం మారాలని విద్యావేత్తలు కోరుతున్నారు. సంఖ్యల కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చదువు నేరుగా ఉద్యోగాలకు దారితీసేలా స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.

బడ్జెట్‌ను ఖర్చుల జాబితాగా కాకుండా దేశ భవిష్యత్తుపై చేసే పెట్టుబడిగా చూడాలని ఆర్థిక నిపుణులు సూచించారు. ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు స్కూల్లో చేరారు? ఎన్ని భవనాలు నిర్మించాం? అనే లెక్కలకే పరిమితమయ్యామని, ఇకపై బోధన నాణ్యత, ఉపాధ్యాయుల సామర్థ్యం, విద్యార్థుల నేర్చుకునే నైపుణ్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పద్ధతుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్ లో ) ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడం, స్కూల్ స్థాయి నుంచే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పరిచయం చేయడం వంటి అంశాలకు బడ్జెట్‌లో స్థానం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేటాయింపులు పెంచాల్సిందే..
ఇక భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలంటే విద్యా రంగానికి కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుప్రియ పట్టానాయక్ పేర్కొన్నారు. బడ్జెట్ 2026లో కనీసం 20 శాతం మేర విద్యా నిధులు పెంచాలని ఆమె సూచించారు. ముఖ్యంగా టయర్-2, టయర్-3 నగరాల్లోని సుమారు 500 విద్యా సంస్థల్లో ఏఐ (AI) ఆధారిత ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కనీసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. దీని ద్వారా క్లైమేట్ అగ్రికల్చర్, హెల్త్ సైన్స్ వంటి కీలక రంగాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
విద్యను వ్యాపారంగా మార్చవద్దు
విద్య అందుబాటులో ఉండాలన్న అంశంపైనా నిపుణులు గట్టిగా స్వరం వినిపిస్తున్నారు విద్యావెత్తలు. ప్రస్తుతం చదువు ఖర్చు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారుతోంది. అందుకే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు, లేదా తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలని, మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు కూడా హై క్వాలిటీ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చినట్లే, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 'లెర్నింగ్ క్రెడిట్స్' ఇచ్చేలా కంపెనీలను ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
డిగ్రీతో పాటు స్కిల్ కలిసొస్తేనే...
మొత్తంగా చూస్తే, ఈసారి బడ్జెట్ 2026లో ప్రభుత్వం కేవలం అంకెల గణితానికి పరిమితం కాకుండా యువతను ఉద్యోగాలకు సిద్ధం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని విద్యా రంగం ఆశిస్తోంది. డిగ్రీతో పాటు స్కిల్ కలిసొస్తేనే భారత యువత ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంచనాలకు ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications