10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి (సెషన్ 1) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. బోర్డు అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ, ఏప్రిల్ మధ్యలో అంటే.. బహుశా ఈ వారంలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. రేపు అనగా ఏప్రిల్ 14న విడుదల చేస్తారని ముందుగా అందరూ భావించినప్పటికి ఆ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కావడంతే సెలవు దినంగా ప్రకటించారు. మరో వైపు మే నెలలో రెండో దశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో, బోర్డు ఈసారి మూల్యాంకన ప్రక్రియను రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసింది. కాబట్టి ఏ క్షణమైనా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది.
ఈ ఏడాది సీబీఎస్‌ఈ చరిత్రలో తొలిసారిగా 10వ తరగతి బోర్డు పరీక్షలను రెండు సెషన్లుగా విభజించారు. విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మొదటి సెషన్ (ఫిబ్రవరి-మార్చి) ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చినా, సెషన్ 2లో మూడు సబ్జెక్టుల వరకు మళ్లీ పరీక్ష రాసి మార్కులు మెరుగుపరుచుకోవచ్చు (Improvement). ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 11 నాటికే ముగిశాయి.

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?
ఫలితాల రోజున వెబ్‌సైట్ క్రాష్ అవ్వకుండా ఉండేందుకు సీబీఎస్‌ఈ ఈసారి అనేక ప్రత్యామ్నాయాలను కల్పించింది. విద్యార్థులు ఈ క్రింది ప్లాట్‌ఫారమ్‌లలో ఫలితాలను చూడవచ్చు:
- వెబ్‌సైట్లు: cbse.gov.in, results.nic.in
- యాప్స్: డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్స్.
- ఆఫ్‌లైన్ మార్గాలు: ఇంటర్నెట్ లేని వారు 7738299899 నంబర్‌కు 'cbse10’ అని SMS పంపడం ద్వారా లేదా IVRS కాల్ (011-24300699) ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
డిజిలాకర్‌లో మార్క్‌షీట్ డౌన్‌లోడ్ చేసుకోండి
మీ ఒరిజినల్ మార్క్‌షీట్, సర్టిఫికెట్‌లు ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే డిజిలాకర్‌లో అందుబాటులో ఉంటాయి.
- digilocker.gov.in లో మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- 'Education' సెక్షన్‌లో సీబీఎస్‌ఈని ఎంచుకోండి.
- మీ రోల్ నంబర్, స్కూల్ కోడ్ ఇస్తే డిజిటల్ మార్క్‌షీట్ డౌన్‌లోడ్ అవుతుంది.
ఈ ఏడాది దేశ విదేశాల్లో కలిపి మొత్తం 43 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 10వ తరగతి విద్యార్థులే 25 లక్షల మంది ఉన్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల కొన్ని పరీక్షలకు అంతరాయం ఏర్పడినప్పటికీ, బోర్డు మిగిలిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసింది. పాఠశాలలు తమ ఇంటర్నల్ మార్కులను ఏప్రిల్ 17లోపు అప్‌లోడ్ చేయాలని పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ ఇప్పటికే ఆదేశించారు.












Click it and Unblock the Notifications