Re-employment for Senior Citizens: ఆ పోర్టల్‌తో సీనియర్ సిటిజెన్లకు ఉద్యోగావకాశాలు...
సీనియర్ సిటిజెన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 'రోజ్‌గార్ ఎక్స్‌చేంజ్' అనే ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. సీనియర్ సిటిజెన్లకు గౌరవప్రదమైన రీ-ఎంప్లాయిమెంట్(Senior Able Citizens for Re-employment in Dignity) అనే పాలసీతో ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటవుతోంది. అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రారంభించనుంది.
60 ఏళ్లు పైబడి,ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగల సీనియర్ సిటిజెన్లు 'రోజ్‌గార్ ఎక్స్‌చేంజ్' పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.ఇందులో వారి చదువు,అనుభవం,స్కిల్స్,ఆసక్తి తదితర వివరాలను పొందుపరచాలి. అయితే ఇందులో రిజిస్టర్ చేసుకున్నంత మాత్రానా 100శాతం ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.కంపెనీల అవసరాలు,వారి ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగావకాశాలు ఉంటాయని చెబుతోంది.
ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపించే సీనియర్ సిటిజెన్లకు సాయపడాలని సీఐఐ,ఎఫ్ఐసీఐఐ,అసోచాం వంటి సంస్థలకు సైతం కేంద్రం లేఖల ద్వారా విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్స్ ప్రకారం.. దేశంలో సీనియర్ సిటిజెన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 13.3కోట్ల మంది సీనియర్ సిటిజెన్లు ఉన్నారు.2026 నాటికి ఈ సంఖ్య 16.28 కోట్లకు చేరనుంది.

ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం... చాలామంది సీనియర్ సిటిజెన్లు యాక్టివ్‌గానే ఉంటున్నారు. సమయం,అనుభవం,శక్తి సామర్థ్యాలను వెచ్చంచగలిగే స్థిరమైన ఉద్యోగులుగా సీనియర్ సిటిజెన్లు కంపెనీలకు ఉపయోపడుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకొచ్చే పోర్టల్ వారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే సీనియర్ సిటిజెన్లతో కంపెనీలు వర్చువల్‌గా సమావేశమై వారిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
గతంలో సీనియర్ సిటిజెన్ల కోసం కేంద్ర ప్రభుత్వం 14567 అనే హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫించన్ సమస్యలు,,న్యాయపరమైన సమస్యల పరిష్కారం,ఎమోషనల్ సపోర్ట్,వేధింపులపై ఫిర్యాదు కోసం ఈ నంబర్‌లో సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications