ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్‌లో ఉద్యోగాలు..ద‌ర‌ఖాస్తు చేశారా..?

ఏపీపీఎస్సీ మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ వెలువ‌రించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 18 గ్రేడ్‌-2 అనలిస్ట్‌ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 చివ‌రితేదిగా నిర్ణ‌యించారు.

కావున అభ్య‌ర్థులు త్వ‌ర‌ప‌డండి. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ అభ్య‌ర్థులు ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ ఉద్యోగాల‌ను కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ఆధారంగా భ‌ర్తీ చేస్తారు. స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ కూడా ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ స‌బ్జెక్టులో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Have you applied for AP Pollution Control Board Jobs

ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి..

అనలిస్ట్ గ్రేడ్-2 మొత్తం పోస్టులు : 18
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 19, 2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్‌ 8, 2024
విద్యార్హ‌త : బ్యాచిలర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌) స‌బ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌సు : 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేత‌నం : ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలకు రూ.48,440-1,37,220 వేత‌నంగా గా నిర్ణయించారు.
ఈ పోస్టుల‌కు ఎంపిక చేయు విధానం : కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.370 ప‌రీక్ష ఫీజు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 250 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+