సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హై అలర్ట్.. ఇక సర్దుకోవాల్సిందేనా..!
AI ఎంట్రీతో ఉద్యోగుల గుండెల్లో గుబులు పట్టుకుంది. కృత్రిమ మేధాతో భవిష్యత్తులో ఉద్యోగాలకు గండి పడుతుందని ఒకింత సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రముఖ టేక్ కంపెనీల సీఈవోల వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక్కొక్కరు ఇలా AI కి వత్తాసు పలుకుతుండడం చూస్తుంటే ఉద్యోగులు ఇంటి బాట పట్టడం గ్యారంటీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో అతి ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఇదే తరహాలో కంటిన్యూ అయితే వారంతా ఇక సర్దుకోవాల్సిందే అని ఓపెన్ గా డిస్కషన్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే Alతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్ ను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకు Infy CEO సలిల్ పారేఖ్ కూడా ఏకీభవించడం మరింత భయపెడుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ బాట పట్టాయి. రీసెంట్ గానే ఇన్‌మోబి సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని.. ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు పోతాయని వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం సాధించామని.. మెషీన్ కోడింగ్ వేగంగా, మెరుగ్గా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు ఏఐ వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications