రైల్వేలో 32 వేలకు పైగా గ్రూప్- డీ పోస్టులు.. గడువు పొడిగింపు.. మిస్ కావొద్దు..
రైల్వే ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుండగా RRB మరోవారం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 4 నుంచి మార్చి 13 వరకు అప్లికేషన్ లో ఎలాంటి తప్పులు ఉన్నా ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది. టైన్త్ లేదా ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ ఇక్కడ చూడండి.
మొత్తం పోస్టులు: 32,438, ఈ ఉద్యోగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలు ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఉన్నాయి.
విద్యార్హతలు: అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ అర్హతలతో పాటు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఓబీసీ, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుం: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
వేతనం: గ్రూప్-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం ఇస్తారు. అదనంగా ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications