బోధన ఆస్పత్రుల్లో 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం: ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ఈ పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశారు. బోధనాసుపత్రుల్లోని 34 స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు.
కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి నియమించనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ ప్రక్రయిను రెండు వారాల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గత సంవత్సరం 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో 9 ప్రారంభం కానున్నాయి.

అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 187 మందిని నియమించనున్నారు. అనస్థీషియా విభాగంలో 177, జనరల్ సర్జరీలో 149, జనరల్ మెడిసిన్‌లో 144, పీడియాట్రిక్స్‌లో 94, ఆర్థో పెడిక్స్‌లో 72, రేడియో డయాగ్నస్టిక్స్‌లో 56, పాథాలజీలో 48, అనాటమీలో 37, ఫిజియాలజీలో 37 మందిని నియమించనుండగా.. మిగిలినవారు 24 విభాగాల్లో నియమితులు కానున్నారు.
మరోవైపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి కూడా చేరువయ్యాయని పేర్కొన్నారు. రెండు వారాల్లోగా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి, నియామక ఉత్తర్వులు అందించి, విధుల్లో చేరేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యవిద్య డైరెక్టర్‌ను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
Great News! MHSRB has released a selection list for 1,442 Assistant Professor posts in 34 specialties for appointment into new Government Medical colleges under @DMETelangana, as part of Hon'ble #CMKCR Garu's vision of one medical college in each district towards…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 8, 2023
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు అంకితభావంతో, సేవా భావంతో కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన నియామక బోర్డును అభినిందించారు. మరోవైపు, 5204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి కూడా ప్రక్రియ మొదలైందని వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications