ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల ప్రిలిమినరీ ‘కీ’ 15న అందుబాటులోకి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డ్(TSLPRB) ఇటీవల నిర్వహించిన సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీవో ఎస్ఐ తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల 'కీ' శనివారం విడుదల కానుంది. శనివారం నుంచి www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని ఏప్రిల్ 15న ఉదయం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.

ఇక ఈ 'కీ' పట్ల సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 17 వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్‌సైట్లో సమర్పించవచ్చు.
ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డ్ ఛైర్మన్ వెల్లడించారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎంఆర్ షీట్‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మిగితా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications