ప్రభుత్వ రంగంలో జాబ్ చేయాలనుకుంటున్నారా.. మీకోసమే ఈ నోటిఫికేషన్ !!

ప్రభుత్వ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు మంచి అవకాశం లభించింది. South Eastern Coalfields Limited (SECL) అప్రెంటిస్‌ల నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం 1,600 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై ఉండగా, మార్చి 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం మంచిది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 500 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్ 1,100 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ, డిప్లొమా అర్హతలతో ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎంపిక ప్రక్రియ కూడా సులభంగానే ఉంటుంది. రాత పరీక్ష లేకుండా విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఇది చాలా మందికి ప్లస్ పాయింట్‌గా మారింది.

south-eastern-coalfields-limited-notification-for-the-recruitment-of-1600-apprentices-posts

మొత్తం పోస్టులు..

1,600

అర్హతలు..

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: BE/B.Tech/BSc/BCom/BBA/BCA

టెక్నీషియన్ అప్రెంటిస్: ఇంజనీరింగ్ డిప్లొమా

10వ/12వ తర్వాత డిప్లొమా చేసిన వారు కూడా అర్హులు

వయో పరిమితి..

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: పరిమితి లేదు

ఎంపిక విధానం..

అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ టెస్ట్

స్టైపెండ్..

ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఎంపికైన వారికి నెలకు ₹10,900 నుంచి ₹12,300 వరకు స్టైపెండ్ అందుతుంది. ట్రైనింగ్ సమయంలోనే ఆదాయం రావడం యువతకు అదనపు ప్రయోజనం.

దరఖాస్తు ప్రక్రియ..

ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. South Eastern Coalfields Limited అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి, వివరాలు నమోదు చేసి, పత్రాలు అప్‌లోడ్ చేసి ఫారమ్ సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు విధానం..

అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్

వ్యక్తిగత, విద్యా వివరాల నమోదు

పత్రాల అప్‌లోడ్

ఫారమ్ సబ్మిట్ & ప్రింట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+