SBI JObs : భారీ జీతంతో 1,500 పీవో పోస్టులకు నోటిఫికేషన్..
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,500 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. మంచి వేతనం, ఆకర్షణీయమైన అలవెన్సులు, వేగవంతమైన కెరీర్ గ్రోత్ వంటి అవకాశాలు ఉన్నాయి.
కాగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 8, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న SBI బ్రాంచ్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సువర్ణావకాశంగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం పోస్టులు - 1,500 ( రెగ్యులర్ పోస్టులు - 1,446, బ్యాక్లాగ్ పోస్టులు - 54 )
అర్హతలు..
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నియామకానికి ముందు డిగ్రీ పూర్తి చేసినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అదనపు ప్రయోజనం ఉంటుంది.
వయోపరిమితి..
ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు:
కనీసం - 21 సంవత్సరాలు
గరిష్టంగా - 30 సంవత్సరాలు
వయో సడలింపులు..
OBC అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
దివ్యాంగులకు - 10 నుంచి 15 సంవత్సరాల వరకు
మాజీ సైనికులు, ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు..
General / OBC / EWS రూ.750
SC / ST / PwBD ఫీజు లేదు
ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.)
మెయిన్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.)
సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ
తుది మెరిట్ జాబితా మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా రూపొందుతుంది.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ.48,480 ఉంటుంది.
అదనంగా:
డియర్నెస్ అలవెన్స్ (DA)
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)
సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్
మెడికల్ బెనిఫిట్స్
లీజ్ రెంట్ సౌకర్యం
ప్రయాణ భత్యాలు
పెన్షన్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
అన్ని అలవెన్సులు కలుపుకొని ఏడాదికి దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.21.91 లక్షల వరకు CTC అందుతుంది.
దరఖాస్తు గడువు..
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం జూన్ 18, 2026
దరఖాస్తులకు చివరి తేదీ జూలై 8, 2026
ఎగ్జామ్ డేట్స్..
ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 2026
మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2026
ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ అక్టోబర్ - నవంబర్ 2026
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి:
కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫారమ్ నింపాలి.
ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications