క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల బాలిక కోరిక తీర్చిన "అల్లు అర్జున్"..!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా లేటెస్ట్ గా అల్లు అర్జున్ తన పెద్ద మనసు చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు.

అసలేం జరిగిందంటే..
ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధితో పోరాడుతున్న శ్రద్ధ అనే ఎనిమిదేళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు జూన్ 19న అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించగా.. వారు వెంటనే స్పందించారు. ఈ మేరకు ఆ చిన్నారితో జరిపిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన విజువల్స్‌ను అల్లు అర్జున్ పిఆర్ టీమ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ వర్చువల్ ఇంటరాక్షన్‌లో అల్లు అర్జున్ ఆ చిన్నారితో ఎంతో ఆప్యాయంగా హిందీలో మాట్లాడారు. శ్రద్ధతో 'పుష్ప: ది రైజ్' సినిమాలోని ఐకానిక్ డైలాగులను అడిగారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై ఒకేసారి 'గడ్డం కింద చేయి తిప్పే' (బియర్డ్-స్ట్రోక్) మేనరిజంను చేసి చూపించారు. చిన్నారి చేసిన ఆ క్యూట్ యాక్షన్‌ను చూసి బన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ 'డ్యామ్ క్యూట్' అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నావని అడగ్గా.. తాను డాక్టర్ అవుతానని ఆ బాలిక సమాధానమిచ్చింది. శ్రద్ధ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Spreading Smiles Beyond Cinema ❤️
— Team Allu Arjun (@TeamAAOfficial) June 19, 2026
Icon Star @alluarjun interacted with Shraddha through the Make-A-Wish Foundation, creating a joyful and unforgettable moment for the young girl. 🤗
A gesture that reflects his genuine warmth and compassion. ❤️ pic.twitter.com/qExSfmTh6a
మరోవైపు జూన్ 22న అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. 2024లో 'పుష్ప 2: ది రూల్' స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి ఆయన కోర్టు ముందుకు రాబోతున్నారు. ఈ లీగల్ ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నారి ముఖంలో నవ్వులు పూయించడానికి ఆయన చూపించిన చొరవను, మానవత్వాన్ని అటు సినీ వర్గాలు, ఇటు సాధారణ నెటిజన్లు కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications