SBI JOBS : 7150 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు..!
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న 7,150 అప్రెంటిస్ పోస్టుల కోసం గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువును బ్యాంకు పొడిగించింది. తొలుత జూన్ 8, 2026తో ముగియాల్సిన దరఖాస్తు ప్రక్రియను తాజాగా జూన్ 15, 2026 వరకు పొడిగిస్తూ SBI అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ద్వారా అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రాక్టికల్ పరిజ్ఞానం, కస్టమర్ సర్వీస్, డిజిటల్ బ్యాంకింగ్, రుణాల నిర్వహణ, శాఖ కార్యకలాపాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.
దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో వారం రోజుల సమయం లభించినట్లైంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 709 పోస్టులు, తెలంగాణకు 491 పోస్టులు కేటాయించారు. మిగిలిన ఖాళీలు వివిధ రాష్ట్రాల్లోని SBI శాఖల్లో భర్తీ చేయబడతాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా డిగ్రీ పూర్తి చేసిన యువతతో పాటు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి..
SBI విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు 2026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు తదితర రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రెండు దశల ఆధారంగా జరుగుతుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష
స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు స్థానిక భాషా పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అనంతరం తుది మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడతారు.
స్టైఫండ్..
అప్రెంటిస్‌గా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైఫండ్ అందజేయనున్నారు. శిక్షణ సమయంలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది శాశ్వత ఉద్యోగ నియామకం కాదని, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కార్యక్రమం మాత్రమేనని SBI స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్ బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఇది విలువైన అనుభవంగా ఉపయోగపడుతుంది.
ఆన్‌లైన్ పరీక్ష ఎప్పుడు?
SBI అప్రెంటిస్ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షను 2026 జులై నెలలో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష తేదీలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి.
పరీక్షలో ఉండే విభాగాలు
1. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్
25 ప్రశ్నలు
25 మార్కులు
2. జనరల్ ఇంగ్లిష్
25 ప్రశ్నలు
25 మార్కులు
3. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్
25 ప్రశ్నలు
25 మార్కులు
4. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
25 ప్రశ్నలు
25 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.
తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యం..
జనరల్ ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన అన్ని విభాగాల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీతో పాటు అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. తెలియని ప్రశ్నలకు ఊహించి సమాధానం ఇవ్వడం వల్ల మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్థానిక భాష పరీక్ష నుంచి ఎవరికి మినహాయింపు?
10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు మార్కుల మెమో ద్వారా నిరూపించగలిగిన అభ్యర్థులకు స్థానిక భాషా పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇతర అభ్యర్థులు మాత్రం స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు కీలక సూచన..
దరఖాస్తు గడువు మరోసారి పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ కోసం ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే యువతకు ఈ అప్రెంటిస్ అవకాశం విలువైన అనుభవాన్ని అందించనుంది.












Click it and Unblock the Notifications