ఫ్రెషర్స్.. గెట్ రెడీ: వచ్చే ఆరునెలల్లో టీసీఎస్‌లో వేల కొద్దీ ఉద్యోగాలు

ముంబై: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల జాతరకు తెర తీసింది. వచ్చే ఆరు నెలల వ్యవధిలో భారీ రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. క్యాంపస్ సెలెక్షన్లు, క్యాంపస్ ఇంటర్వ్యూలతో యువతకు భారీ ప్యాకేజీలతో ముందుకు రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కంపెనీ క్షీణతలోనూ రిక్రూట్‌మెంట్స్‌ను పరుగులు పెట్టించనుంది.

ఆరు నెలల్లో 43 వేల ఉద్యోగాలు..

ఆరు నెలల్లో 43 వేల ఉద్యోగాలు..

వచ్చే ఆరు నెలల వ్యవధిలో కనీసం 43,000 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించుకుంది టీసీఎస్. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో 35,000, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో మిగిలిన ఎనిమిది వేలను భర్తీ చేయాలనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు టీసీఎస్ మానవ వనరుల విభాగం చీఫ్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఇందులో 40,000 మంది ఫ్రెషర్స్‌ను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో 78,000 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌మెంట్ చేసుకున్నట్టవుతుందని పేర్కొన్నారు.

 11 శాతం క్షీణత..

11 శాతం క్షీణత..

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి టీసీఎస్ నెట్ ప్రాఫిట్‌లో 11.2 శాతం మేర క్షీణత కనిపించింది. ఇదే క్షీణత మరో రెండు నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నట్లు మిలింద్ లక్కడ్ అంచనా వేశారు. మావన వనరులను బలోపేతం చేసుకోవడం ద్వారా.. అంటే కొత్త వారిని నియమించుకోవడం ద్వారా క్షీణతను అడ్డుకోవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ ఆదాయం క్షీణించిన సమయంలోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలను నియమించుకోవడం ద్వారా వచ్చే అదనపు భారాన్ని.. భవిష్యత్తులో భర్తీ చేసుకుంటామని చెప్పారు.

 5.28 లక్షల మంది

5.28 లక్షల మంది

కంపెనీ నెట్ ప్రాఫిట్ క్షీణిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 19,690 మంది ఫ్రెషర్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకున్నామని అన్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 5.28 లక్షలకు చేరిందని, ఇందులో మహిళల సంఖ్య 36.2 శాతంగా ఉందని చెన్పారు. దీన్ని మరింత పెంచాల్సి ఉందని, దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని టీసీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజేష్ గోపీనాథన్ తెలిపారు.

70 శాతం మంది వ్యాక్సినేటెడ్

70 శాతం మంది వ్యాక్సినేటెడ్

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 70 శాతం మంది ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని రాజేష్ గోపీనాథన్ చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్లను ఇప్పిచామని చెప్పారు. ఉద్యోగులెవరూ ఈ ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి పలు చర్యలు తీసుకున్నామని వివరించారు. వర్క్ ఫ్రమ్ విధానంలో ఇప్పటికీ 98 శాతం మంది పని చేస్తున్నారని చెప్పారు. క్రమంగా వారందరినీ ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నామని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేసే ఉద్యోగుల శాతాన్ని 80 శాతానికి తగ్గించేలా లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+