Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు ఆమోదం: ఎంత మందినంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 సంవత్సరాలుగా 567 మంది ఉపాధ్యాయులు ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరందరినీ రెగ్యూలరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. తాజా నిర్ణయం పట్ల సదరు కాంట్రాక్ట్ టీచర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.

Telangana: approval of regularization of Gurukula contract teachers

డీఎస్సీ ద్వారా 5089 టీచర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.

ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశామని మంత్రి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+