టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీలు ఖరారు: ఎప్పుడంటే?
హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదా వేసిన రెండు పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తాజాగా ప్రకటించింది. టీపీబీవో(Town Planning Building Overseer), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
జులై 8వ తేదీన టీపీబీవో రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. రాతపరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఏఈఈ హాల్ టికెట్లు
తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రదన్ తెలిపారు. మే 21, 22 తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ వెబ్‌సైట్‌లో ఉందని, అభ్యర్థులు ముందుగా ప్రిపేర్ కావాలని సూచించారు.
మంగళవారం నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ వెబ్‌సైట్‌లో ఉన్నదని, అభ్యర్థులు ముందుగా ప్రిపేర్ కావాలని సూచించారు.
ఏఈఈ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ పద్ధతిలోనే జరుపనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్-1 పరీక్ష గత అక్టోబర్ 16న జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 2,85,916 మంది పరీక్షను రాశారు. వీరిలో 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications