ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల: అప్లై చేయండి
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ప్రొఫెసర్‌ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ను సంప్రదించవచ్చు.

కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు ఆగస్టు 18వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయ తెలిసిందే. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటుచేశారు. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్ టికెట్లు www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే [email protected] కు ఈమెయిల్ లేదా 9393711110, 9391005006కు ఫోన్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications