టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో.. కొంచెం గ్యాప్ తీసుకొని తెలుగులో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.
కాగా ఈ టాలీవుడ్ యంగ్ హీరో త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా.. తాజాగా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా స్పష్టత వచ్చింది.

ఈ జంట నిశ్చితార్థం ఏప్రిల్ 5న ఘనంగా జరగనుంది. నగర పరిసరాల్లోని ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు...
అయితే ఈ జంట వివాహ ప్రయాణం గత నెలలోనే ప్రారంభమైంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన నిశ్చయ తాంబూలాల వేడుకతో వీరి బంధం అధికారికంగా మొదలైంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ ద్వారా పబ్లిక్‌గా ప్రకటించనున్నారు.
అందరి లాగా కాకుండా..
ఇక మరి ముఖ్యంగా సినిమా స్టైల్ గ్రాండ్ వెడ్డింగ్‌లకు భిన్నంగా, ఈ జంట తమ వివాహాన్ని ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో జరుపుకోవాలని నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 29న Tirumalaలో శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనుంది. వేద మంత్రాల నడుమ, పవిత్రమైన ఆ క్షేత్రంలో శ్రీనివాస్-కావ్య రెడ్డి దంపతులుగా మారనున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్?
పెళ్లి అనంతరం సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వివాహ విందు (రిసెప్షన్) నిర్వహించే అవకాశముంది. ఈ కార్యక్రమం మరింత గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్..
ఇటీవలే తన కాబోయే సతీమణిని పరిచయం చేస్తూ Bellamkonda Sai Srinivas సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీతో నా రోజులను నింపినందుకు థాంక్స్. నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ వాడిపోనీయను" అంటూ పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications