వివాహబంధంలోకి అడుగుపెట్టిన నటి అమీజాక్సన్...
నటి అమీ జాక్సన్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్, నటి అమీ జాక్సన్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఇటలీలో ఎంతో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ విషయాన్నే స్వయంగా వారే సోషల్‌మీడియాలోని తమ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తమ 'కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అంటూ ఒక క్యాఫ్షన్ కూడా పెట్టారు.
నటి అమీజాక్సన్, వెస్ట్‌విక్‌లు గతేడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే ఈ జంట ఇటలీకి వెళ్లింది. అక్కడికి వెళ్లే ముందు ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి విమానంలో వెళుతున్న పోటోలను నటి అమీ జాక్సన్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలకు వీరు 'పెళ్లి చేసుకుందాం బేబీ' అని క్యాప్షన్ కూడా పెట్టారు. తాజాగా, నిన్న (ఆదివారం) ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.

వీరిద్దరూ లగ్జరీ యాచ్‌లో ప్రీ-వెడ్డింగ్ పార్టీ వేడుకలు కూడా చేసుకున్నారు. అమీ కొడుకు ఆండ్రియాస్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. అమీ, వెస్ట్‌విక్ 2022లో సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో మొదటిసారిగా కలుసుకున్నారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త కొన్నిరోజులకు ప్రేమగా ఏర్పడింది. ఆ ప్రేమ ఇప్పడు ఇద్దరినీ ఒక్కటి చేసింది. నటీ అమీ జాక్సన్ గతంలో జార్జ్ పనియోటౌ అనే బిజినెస్‌మెన్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలం పాటు డేటింగ్ కూడా చేశారు. అందుకు ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే, వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకుందామనే లోపే కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అనంతరం వీరిద్దరి మధ్య అపార్థాలు రావడంతో వీరూ విడిపోయారు. ఇప్పడు ఈ నటి హాలీవుడ్ నటుడుని పెళ్లిచేసుకుంది.












Click it and Unblock the Notifications