రూ.కోట్లు వదిలి సన్యాసిగా మారిన హీరోయిన్
ఆమె పేరు బర్ఖా మదన్. పంజాబ్ లో పెట్టారు. మొదటగా మోడలింగ్ లోకి అడుగుపెట్టి 1994లో మిస్ ఇండియా ఫైనల్ లో మొదటి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా, మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ లో మూడో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించి పాపులర్ అయ్యారు. సినిమాలతోపాటు సీరియల్స్ లో కూడా నటించిన తర్వాత ఏమైందో ఏమిటో తెలియదుకానీ అకస్మాత్తుగా సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చారు.
చాలామంది హీరోయిన్ గా నటించిన తర్వాత, కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటారు. అయితే ఒక సన్యాసిగా మారడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బర్ఖా మదన్ 1996లో హిందీలో ఖిలాడీ కా ఖిలాడీ సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. 2012 వరకు సినిమాల్లో నటించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో భూత్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరిచేత ప్రశంసలందుకుంది. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్ , నానా పటేకర్ , ఫర్దీన్ ఖాన్ , రేఖ వంటి స్టార్లతో కలిసి పనిచేయడంతోపాటు జీ టీవీ షో సాఫ్ ఫెరే సలోని కా సఫర్ లో కూడా నటించింది.

గోల్డెన్ గేట్ ఎల్ ఎల్సి నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్ పై రెండు సినిమాలను నిర్మించింది. 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలనే నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కొన్ని కారణాలవల్ల మూడు సంవత్సరాల విరామం తీసుకుంది. బౌద్ధమతాన్ని తీసుకున్న తర్వాత తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్ గా మార్చుకుంది. ప్రస్తుతం పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతుంది.












Click it and Unblock the Notifications