ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్.. ఇప్పుడు బట్టలు అమ్ముకుంటుంది..!
బండ్లు ఓడలు,ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనం తరచూ వింటాం. ఈ సామెత సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి సరిగ్గా సరిపోతుంది. సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దాల మేడల్లాగా బాగా కనిపిస్తాయి. కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే అనేక బాధలు దర్శనం ఇస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.ఓ వెలుగు వెలిగిన నటి, ఇప్పుడు బట్టలు అమ్మకుంటుంది. ఆమె మరెవరో కాదు..చారు అపోస. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితురాలే. చారు అసోపా 2009లో "అగ్లే జనమ్ మోహే బిటియా హి కిజో" సీరియల్‌తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించారు.
ఆమె అనేక ప్రసిద్ధ సీరియల్స్‌లో నటించారు, వాటిలో "యే రిష్తా క్యా కెహ్లాతా హై", "బడే అచ్చే లగతే హైన్", "బాల్ వీర్", "మేరే ఆంగ్నే మేయిన్" మరియు "జీజీ మా" ముఖ్యమైనవి.ఆమె 2011లో "ఇంపేషెంట్ వివేక్" అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత "కాల్ ఫర్ ఫన్" (2017) మరియు "జోహ్రీ" (2023) వంటి సినిమాల్లో కూడా నటించారు. చారు అపోస వైవాహిక జీవితం కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చూసింది.చారు అసోపాకు రెండుసార్లు వివాహం జరిగింది మరియు రెండుసార్లూ విడాకులు తీసుకున్నారు.ఆమె మొదటి వివాహం 2007లో సోమ్‌వీర్ పుజారితో జరిగింది. అయితే, వారిద్దరి మధ్య పొరపొచ్చలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత, చారు అసోపా 2019లో నటి సుస్మితా సేన్ తమ్ముడు రాజీవ్ సేన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో జియానా సేన్ అనే కుమార్తె జన్మించింది. అయితే, వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అనేక మనస్పర్థాల తర్వాత, 2023లో చారు మరియు రాజీవ్ సేన్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. చారు అసోపా ప్రస్తుతం తన కుమార్తె జియానాతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్ లో చారు అపోస తన బట్టల వ్యాపారం చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా బట్టలు అమ్ముతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications