భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!
బంగ్లాదేశ్ (Bangladesh)లో రెండేళ్ల క్రితం జరిగిన విద్యార్ధుల తిరుగుబాటు తర్వాత పారిపోయి వచ్చి భారత్ (India)లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా ఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ మీట్ మళ్లీ ఇరుదేశాల మధ్య చిచ్చు రేపింది. ఈ ఏడాది డిసెంబర్ లో స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానంటూ గతంలోనే వెల్లడించిన హసీనా.. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడేందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులోనూ ఆమె పాత పాటే పాడారు. అయితే ఈ ప్రెస్ మీట్ కు భారత్ అనుమతివ్వడంపై బంగ్లాదేశ్ మండిపడుతోంది. అలాగే ఆమె కుమారుడు వాజెద్ బంగ్లాపై చేసిన విమర్శలు కలకలం రేపాయి.
షేక్ హసీనా (Sheikh Hasina)ను గతంలో భారత్ తో సత్సంబంధాలు నెరిపారన్న కారణంతో కేంద్రం ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చింది. అయితే బంగ్లాదేశ్ లో విద్యార్ధుల తిరుగుబాటు సందర్భంగా ఆమె ఇచ్చిన ఆదేశాలు, వాటి కారణంగా చోటు చేసుకున్న దారుణాలపై విచారణ జరిపిన కోర్టు .. ఆమెకు ఇప్పటికే మరణశిక్ష విధించింది. ఈ తరుణంలో ఆమె స్వదేశానికి వెళ్తే మరణశిక్ష అమలు చేయడం ఖాయం. ఈ లోపు అంతర్జాతీయంగా సానుభూతి సంపాదించుకోవడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు భారత్-బంగ్లా మధ్య చిచ్చురేపుతున్నాయి.

నిన్న హసీనా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమెరికా నుంచి వర్చువల్ గా పాల్గొన్న ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ .. తన స్వదేశం బంగ్లాదేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకపోతే బంగ్లాదేశ్ ఒక విఫల దేశంగా దిగజారుతుందని, ప్రాంతీయ ఉగ్రవాదానికి నిలయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విదేశీ గూఢచార సంస్థలు, ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఇప్పుడు బంగ్లాదేశ్ లో స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌గా మారడం అనేది అత్యంత ఆందోళన కలిగించే విషయమన్నారు. బహిరంగ సభల్లో అల్-ఖైదా కార్యకర్తలు ప్రసంగాలు చేస్తున్నారని, ఇది భారత్ కే కాకుండా ప్రపంచం మొత్తానికీ ఏమాత్రం శుభసూచకం కాదన్నారు.

Bangladesh is outraged that the absconding convicted genocider Sheikh Hasina was allowed this evening to engage in live interaction with the media in New Delhi where she and her henchmen launched venomous vitriol against the State of Bangladesh and her people.
— Ministry of Foreign Affairs (@BDMOFA) August 5, 2026
Dhaka deeply… pic.twitter.com/7BDnAxk5N8
మరోవైపు హసీనా ప్రెస్ మీట్ పెట్టేందుకు అవకాశం ఇచ్చిన భారత్ పై బంగ్లాదేశ్ మండిపడింది. ద్విపాక్షిక సంబంధాలపై పడే ప్రభావం గురించి భారత్ కు ముందే హెచ్చరించినప్పటికీ, పరారీలో ఉన్న దోషిగా, నరమేధానికి పాల్పడిన వ్యక్తిగా తాము పదేపదే పేర్కొంటున్న షేక్ హసీనాకు భారత గడ్డపై ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టేందుకు అనుమతి లభించడం పట్ల బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన సమయం దీనిని మరింత బాధాకరంగా మార్చిందని పేర్కొంది. జూలై విప్లవం వార్షికోత్సవం సందర్భంగా ఆమె చేసిన ఈ ప్రసంగం బంగ్లాదేశ్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమే కాకుండా, ఉద్యమ అమరవీరులకు తీవ్ర అవమానంగా మారిందని అభివర్ణించింది.














Click it and Unblock the Notifications