పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఇలా..! కేబినెట్ కీలక నిర్ణయం..!

దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు వివిధ కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Scheme) డబ్బులు దాచుకుంటుంటారు. వీటి వడ్డీ రేట్లను కేంద్రం కాలానుగుణంగా సవరిస్తుంటుంది. ఇందులో సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్రాలు, పీపీఎఫ్, ఎన్ఎస్సీ ఇలా పలు పథకాలు ఉంటాయి. వీటి వడ్డీ రేట్లపై ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఆయా పథకాలకు ఇస్తున్న వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకూడదని కేబినెట్ నిర్ణయించింది.

PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!
PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!

కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఆయా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్లే రాబోయే మూడు నెలల్లో కొనసాగబోతున్నాయన్న మాట. కేంద్ర ప్రభుత్వం చివరి సారిగా ఈ పథకాల వడ్డీ రేట్లను 2023-24 సంవత్సర నాలుగో త్రైమాసికంలో సవరించింది. అప్పటి నుంచీ వీటిలో ఎలాంటి మార్పూ చేయడం లేదు. ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయంతో వరుసగా పదో త్రైమాసికంలో ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు అయింది.

Small Savings Scheme Interest Rates Unchanged for October-December 2026 Centre
రైతున్నలకు కేంద్రం భారీ బంపర్ గిఫ్ట్.. సింహభాగం డబ్బులు ఈ రాష్ట్రానికే
రైతున్నలకు కేంద్రం భారీ బంపర్ గిఫ్ట్.. సింహభాగం డబ్బులు ఈ రాష్ట్రానికే

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆయా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఓసారి చూద్దాం. ఇందులో సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8.2 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లకు 7.1 శాతం, పీపీఎఫ్ కు 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్రాలకు 7.5 శాతం, జాతీయ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC)కు 7.7 శాతం, నెలవారీ పొదుపు పథకానికి 7.4 శాతం, పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్ పథకాలకు 4 శాతం వడ్డీ రేట్లు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆయా పథకాల్లో పొదుపు చేస్తున్న వారు వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ వడ్డీ రేట్లను కదపకూడదని కేంద్రం నిర్ణయించడమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+