పొదుపు సరే.. వ్యాట్ తో పెట్రో దోపిడీ సంగతేంటి ? చంద్రబాబుకు షర్మిల ప్రశ్న..!

ఇప్పటికే దేశంలోనే అత్యధిక పెట్రో ధరలు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఏపీలో తాజాగా కేంద్రం పెంచిన ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాట్ విధిస్తూ పెట్రో ధరల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా మండిపడ్డారు. అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉండటమా అడ్వాన్స్​డ్ ఆంధ్రప్రదేశ్ అంటే అని ప్రశ్నించారు. వ్యాట్ పేరుతో జనాలను బాదడమా దేశానికి ఏపీ రోల్ మోడల్ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. సెస్ ల పేరుతో జనాల పర్సులు ఖాళీ చేయడమా విజన్ ఆంధ్రప్రదేశ్ ? పొదుపు మంత్రం సరే.. మరి వ్యాట్ దోపిడీ సంగతేంటి అని చంద్రబాబును ప్రశ్నించారు.

సైకిళ్ళు, ఈ-వెహికిల్స్ ఒకే.. మరి లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ లేదా ? పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి భాద్యత లేదా ? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలు ఉంటే దాన్ని తలదన్నే అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113.62 పైసలు ఉందన్నారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో లీటర్ డీజిల్ ధర రూ .93.75 పైసలు ఉందన్నారు. ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రం ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలు ఉందన్నారు. పక్కరాష్ట్రం తమిళనాడుతో పోల్చినా రూ. 10 రూపాయలు అదనం అని తెలిపారు. కర్ణాటకతో రూ .7, తెలంగాణ, కేరళతో చూసినా రూ.4 రూపాయలు ధరాభారం ఉందన్నారు.

YS Sharmila Questions Chandrababu as AP Hits Highest Fuel Prices in the Country demands to reduce 31 VAT

అధిక వ్యాట్ , అడిషనల్ వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై పడుతున్న అదనపు భారం అక్షరాల 10 వేల కోట్లన్నారు. ఆదాయం పెంపు మార్గాలని 2014 నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని షర్మిల విమర్శించారు. కాబట్టి పెట్రోల్,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ ను తగ్గించాలన్నారు. కర్ణాటకలో సేల్స్ టాక్స్ గరిష్టంగా 29 శాతం మాత్రమేనని, తమిళనాడులో ఇది కేవలం 13 శాతమేనన్నారు. తెలంగాణలో 35 శాతం వ్యాట్ విధింపు ఉన్నా.. అదనపు వ్యాట్ 4 రూపాయల చార్జీల భారం లేదన్నారు. ప్రజల కోసం వ్యాట్ తగ్గింపుతో పాటు అదనంగా వసూలు చేస్తున్న 4 రూపాయలను, రోడ్డు సెస్ పేరుతో దోపిడీ చేస్తున్న రూ.1ని, మొత్తంగా లీటర్ ధరపై కనీసం 5 రూపాయలు అయినా ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+