బెంగళూరులో ఈ రద్దీ రూట్ లో మెట్రో రైల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
బెంగళూరు ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నమ్మ మెట్రో పింక్ లైన్ ఎలివేటెడ్ కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్, గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, ఎంపీ తేజస్వి సూర్య పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ, డీకే శివకుమార్ మెట్రో రైలులో ప్రయాణించారు.
బెంగళూరు మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ ఎలివేటెడ్ విభాగాన్ని రూ. 3,470 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దారు. ఈ పింక్ లైన్ అందుబాటులోకి రావడంతో బెంగళూరులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో నెట్‌వర్క్ ఓ కీలక మైలురాయిని చేరుకున్నట్టయింది. మొత్తం మెట్రో మార్గం పొడవు 100 కిలోమీటర్ల మార్కును అధిగమించింది. 103.5 కిలోమీటర్లకు చేరుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న బెంగళూరు నగరవాసులు.. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులకు ఈ మెట్రో విస్తరణ భారీ ఉపశమనం కలిగించనుంది.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పింక్ లైన్ ఎలివేటెడ్ సెక్షన్ కాలేన అగ్రహార నుంచి తావరేకెరె వరకు 7.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో కాలేన అగ్రహార, హుళిమావు, ఐఐఎంబీ (బిలేకహళ్లి-ఐఐఎంబీ), జేపీ నగర ఫోర్త్ ఫేజ్, జయదేవ హాస్పిటల్, తావరేకెరె స్టేషన్లు ఉన్నాయి. ఈ రూట్‌లో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు కిందటి నెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. అదే నెల 28న అనుమతులు లభించాయి.
ఈ మొత్తం కారిడార్‌లో ఎలివేటెడ్- 6, అండర్ గ్రౌండ్- 12 స్టేషన్లు ఉంటాయి. ప్రస్తుతం ఎలివేటెడ్ విభాగాన్ని మాత్రమే ప్రారంభించగా, తవరేకెరె నుండి నాగవార వరకు సాగే అండర్‌గ్రౌండ్ లైన్ నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గం కూడా పూర్తయితే బెంగళూరు దక్షిణ ప్రాంతం నుంచి నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
ಗುಲಾಬಿ ಮೆಟ್ರೋ ಸಂಚಾರ ; ಹೊಸ ಹಾದಿ, ಹೊಸ ಆರಂಭ ಬೆಂಗಳೂರಿನ ನಗರ ಸಾರಿಗೆ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಹೊಸ ಮೈಲಿಗಲ್ಲು ಸ್ಥಾಪಿಸಲಿರುವ ನಮ್ಮ ಮೆಟ್ರೋ ಗುಲಾಬಿ ಮಾರ್ಗದ ಸಂಚಾರಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಿದ ವಿಶೇಷ ಕ್ಷಣಗಳು. A New Line. A New Beginning.Glimpses of the flag-off of Namma Metro’s Pink Line, marking a new milestone in Bengaluru’s urban mobility journey.#NammaMetro | #PinkLine
— DK Shivakumar (@DKShivakumar) November 13, 2026
ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడారు. బెంగళూరులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. పర్యావరణహిత రవాణా సౌకర్యాలను అందించడానికి మెట్రో నెట్ వర్క్ ను మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రతిరోజూ ప్రయాణించే పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఇన్ ఫ్రాను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
