" చెత్త ఓటమికి కారణం మీరే..!"-ఆ ముగ్గురిపై విరుచుకుపడ్డ గంభీర్..!

న్యూజీలాండ్ తో ఇవాళ జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఏకంగా 244 పరుగుల తేడాతో ఓడిపోయి, చరిత్రలోనే రెండో అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసుకుంది. పేపర్ పై పులుల్లా కనిపించే భారత బ్యాటింగ్ లైనప్ కేవలం 89 పరుగులకే ఆలౌట్ కావడం టీమ్ మేనేజ్మెంట్ కు అస్సలు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ మ్యాచ్ తర్వాత (Gautam Gambhir) తన ఆక్రోశాన్ని ఏమాత్రం దాచుకోకుండా వెళ్లగక్కేశారు.

Ind vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్- హెన్రీ దెబ్బకు 0కే రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ఔట్..!
Ind vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్- హెన్రీ దెబ్బకు 0కే రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ఔట్..!

కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ విసిరిన బంతులు ఆడలేనంత కష్టమైనవి కాదని, బ్యాటర్లు వాటిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని, ఇది తనకు ఆందోళన కలిగించే విషయంగా మారిందని గౌతం గంభీర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేని బంతులు అంటూ ఏవీ ఉండవని, తాము మొదటి 10 ఓవర్లను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిందని గంభీర్ అంగీకరించారు. మాట్ హెన్రీ సరైన చోట్ల బంతులు వేశాడని, కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలన్నారు. కేవలం 90 పరుగులకే ఆలౌట్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే అన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ప్రపంచ కప్‌కు దగ్గరగా ఉన్నాయన్నారు. గత మ్యాచ్‌లో కూడా తాము ఏడు వికెట్లు కోల్పోయామని, ఇది ఆందోళనకరమే అన్నారు.

Gautam Gambhir Holds Virat Rohit and Shreyas Accountable After India s Batting Disaster in 4th ODI
IPL 2027: ఈసారి ఐపీఎల్ కోసం జరిగిన ఆటగాళ్ల మార్పులు, చేర్పులివే..!
IPL 2027: ఈసారి ఐపీఎల్ కోసం జరిగిన ఆటగాళ్ల మార్పులు, చేర్పులివే..!

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ కు భారత బౌలర్లు 333 పరుగులు సమర్పించుకున్నా, బౌలింగ్ విభాగాన్ని గంభీర్ వెనకేసుకొచ్చారు. ఫీల్డింగ్‌లో భారత్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిందని, ఎందుకంటే కొన్ని క్యాచ్‌లు జారవిడిచారని గుర్తుచేశారు. అలాగే
యువ పేసర్ ఆకిబ్ నబీ దురదృష్టవంతుడని, ఒకవేళ తమకు విల్ యంగ్ దొరికి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. జరిగిపోయిన దాని గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. తామంతా బౌలింగ్ విభాగం గురించి గర్వపడాలన్నారు. సీమ్ ను ఎదుర్కోవడంలో టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్ విఫలం కావడంపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సాంకేతిక అంశాల్లోకి వెళ్లనని, బంతి పెద్దగా పక్కకు మళ్లలేదని తెలిపారు. బంతి కదలికను అడ్డుకోవడం బ్యాటర్ పని అని, సీమ్ కంటే ఎక్కువగా, బంతి ఉన్న ప్రాంతాలు, లెంగ్త్ తమకు ఇబ్బందులు సృష్టించాయన్నారు. తాము క్రీజ్‌లో ఇరుక్కుపోయామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+