IPL 2027: ఈసారి ఐపీఎల్ కోసం జరిగిన ఆటగాళ్ల మార్పులు, చేర్పులివే..!
ఐపీఎల్ 2027 (IPL 2027) కోసం వచ్చే నెలలో బీసీసీఐ మినీ వేలం నిర్వహించనుంది. అంతకు ముందే ఆటగాళ్లను పరస్పరం మార్చుకునేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం విధించిన గడువు నవంబర్ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన ఆటగాళ్ల మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు. వీరు ఏయే జట్లకు ఎంతెత ప్యాకేజీలకు మారారో ఓసారి చూద్దాం..
ఇప్పటివరకూ మారిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లక్నో వీడి ఢిల్లీకి 15 కోట్ల రేటుకు, కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నోకు 13.50 కోట్లకు, నటరాజన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు 5 కోట్లకు, జీషన్ అన్సారీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 40 లక్షలకు, లియామ్ లివింగ్ స్టోన్ హైదరాబాద్ నుంచి చెన్నైకు 6 కోట్లకు, జాక్ ఎడ్వర్డ్స్ హైదరాబాద్ నుంచి చెన్నైకు 3 కోట్లకు, ఖలీల్ అహ్మద్ చెన్నై నుంచి హైదరాబాద్ కు 4.8 కోట్లకు, నాథన్ ఎల్లిస్ చెన్నై నుంచి హైదరాబాద్ కు 2 కోట్లకు తరలివెళ్లారు. వీరు కాకుండా తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ కు మారగా.. అర్ష్ దీప్ సింగ్ ముంబైకు మారాడు. వీరి ట్రేడ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సీజన్ కోసం రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లను ఢిల్లీ, లక్నో జట్లు మార్చుకున్నాయి. అలాగే హైదరాబాద్, చెన్నై జట్లు ఏకంగా నలుగురు ప్లేయర్లను మార్చుకున్నాయి. వీరిలో లియామ్ లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ హైదరాబాద్ నుంచి చెన్నైకు మారారు. అలాగే ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై నుంచి హైదరాబాద్ జట్టులోకి వచ్చారు. వీరి తర్వాత అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాల్ని ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పరస్పరం మార్చుకున్నాయి. ఆటగాళ్ల మార్పులు, చేర్పులకు గడువు మరో ఐదు రోజులే మిగిలి ఉండటంతో ఇక కొత్తగా చేరికలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహించబోతున్నారు. ఇందులో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.














Click it and Unblock the Notifications
