విమానంలోనే ప్రైవేట్ రొమాన్స్.. ఇదెక్కడి వింత ఆఫర్!
హోటళ్లు, రిసార్టులు, ప్రైవేట్ విల్లాల్లో జంటలు సమయం గడపడం సహజమే. కానీ వేలాది అడుగుల ఎత్తులో ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ప్రైవేట్ సమయాన్ని గడపడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా అనిపించినా, ఈ తరహా అనుభూతిని పొందడం కోసం రూ.వేలల్లో ఖర్చు చేసేందుకు జంటలు పోటీ పడుతున్నారు. ఈ వినూత్న అనుభవానికి సంబంధించిన కాన్సెప్టే 'మైల్ హై క్లబ్'.
ఏమిటీ 'మైల్ హై క్లబ్'?
సాధారణంగా విమాన ప్రయాణంలో తమ భాగస్వామితో ప్రత్యేకంగా సమయాన్ని గడిపే ప్రయాణీకులను సరదాగా 'మైల్ హై క్లబ్' సభ్యులుగా వ్యవహరిస్తారు. అయితే ప్రస్తుతం కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఈ అనుభవాన్ని పూర్తి ప్రైవేట్ ఫ్లైట్ ద్వారా బిజినెస్ ఆఫర్‌గా అందిస్తున్నాయి. అమెరికాలోని లాస్ వేగాస్‌కు చెందిన ఓ చార్టర్ కంపెనీ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రైవేట్ విమానాలను బుక్ చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. 45 నిమిషాల ప్రయాణం కలిగిన ఈ సెన్నా విమానాల్లో బెడ్ సదుపాయం కూడా ఉంటుంది.

45 నిమిషాల ప్రయాణానికి రూ.83 వేలు!
ఈ ప్రత్యేక అనుభవం కోసం దాదాపు 995 డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జంటలకు మాత్రమే ప్రైవేట్ టైమ్ లభిస్తుంది. అదనపు ప్రయాణీకులు ఉంటే దానికి మరో 200 డాలర్లు చెల్లించాలి. ప్రయాణం ముగిసిన తర్వాత పైలట్ సంతకంతో కూడిన 'మైల్ హై క్లబ్ మెంబర్షిప్ సర్టిఫికేట్'ను కూడా అందజేస్తారు. జంటల రహస్యానికి ఎలాంటి భంగం కలగకుండా పైలట్ 'నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్' ధరిస్తారు.
ఈ క్లబ్ పుట్టుక వెనుక దాదాపు 100 ఏళ్ల నాటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 1914 జూన్‌లో అమెరికన్ పైలట్, అన్వేషకుడు లారెన్స్ బర్ట్స్ స్పెర్రీ 'ఆటోపైలట్' టెక్నాలజీని ఆవిష్కరించారు. 1916 నవంబర్లో స్పెర్రీ తన సీప్లేన్‌లో ఓ మహిళా మిత్రురాలితో కలిసి న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ సమీపంలో ఎగురుతున్నప్పుడు విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో ఉంచి ఆమెతో సమయం గడిపారు. ఆ సమయంలో కంట్రోల్ తప్పి విమానం నీటిలో పడిపోయింది. వేటాడేందుకు వచ్చిన స్థానికులు వీరిని కాపాడేసరికి వారిపై దుస్తులు లేకపోవడంతో ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆనాటి నుంచి స్పెర్రీని 'మైల్ హై క్లబ్' వ్యవస్థాపకుడిగా సరదాగా పేర్కొంటారు.
భద్రతా నిబంధనలు సవాలే!
కొందరు కస్టమర్లు దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికీ.. అన్ని దేశాల్లో ఈ తరహా ప్రైవేట్ విమానాలకు అనుమతులు లభించవు. 2011లో బ్రిటన్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటువంటి సేవలు అందించే ఓ సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించింది. విమాన ప్రయాణంలో ఇటువంటి కార్యకలాపాలు పైలట్ దృష్టిని మళ్లించే ప్రమాదం ఉందని.. ప్రయాణీకుల భద్రతకు ముప్పుగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


వందేళ్ల క్రితమే మొదలైన వ్యవహారం!










Click it and Unblock the Notifications
