తక్కువ టైమ్ లో ఆలుగడ్డ కారం.. ఇలా చేయండి, వారెవ్వా అనాల్సిందే!

భారతీయ వంటకాల్లో ఆలుగడ్డకు ఉండే ప్రత్యేకతే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో చేసే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు భోజనానికి అదనపు రుచిని అందిస్తాయి. అందులోనూ వేడి వేడి అన్నంలోకి బంగాళాదుంప కారం ఉంటే రోజూ తినే దానికన్నా కాస్త ఎక్కువ తినటం గ్యారెంటీ. సాధారణంగా చేసుకునే ఆలూ కూరలకు భిన్నంగా, ఈ ఆంధ్రా స్టైల్ బంగాళాదుంప కారం ప్రత్యేకమైన కారంతో తయారు చేయబడుతుంది.

ఈ వంటకం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక్కపూట మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో తయారు చేస్తే దాదాపు 3 రోజుల పాటు చెడిపోకుండా తాజాగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బాక్స్‌లలోకి త్వరగా అయిపోయే కర్రీ కావాలనుకున్నప్పుడు ఇది చక్కటి ప్రత్యామ్నాయం. తక్కువ పదార్థాలతో అతి తక్కువ సమయంలోనే దీన్ని సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
ఆలుగడ్డలు - అర కేజీ
నూనె - ఫ్రై చేయటానికి కావాల్సినంత
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు - పావు స్పూన్
మసాలా కారం - 1న్నర స్పూన్
జీలకర్ర - అర స్పూన్
ఆవాలు- అర స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా

aloo gadda Karam Recipe Instant Potato Curry That Lasts 3 Days make in this process with masala karam

ఈ రుచికరమైన కర్రీ కోసం ముందుగా తాజా ఆలుగడ్డలను తీసుకుని తొక్క పీల్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి . ఆ తర్వాత స్టవ్ పై బాణలి పెట్టి అందులో తగినంత నూనె వేసి నూనె బాగా కాగాక ఆలు గడ్డ ముక్కలు వేసి మీడియం మంటపై పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని తీసి వేరే బౌల్ లో పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి పోపు వేయించాలి.

అనంతరం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి అందులో తగినంత ఉప్పు, పసుపు మరియు ప్రత్యేకంగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం పొడిని (వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు దంచిన మిశ్రమం) వేసి బాగా కలపాలి. ఈ మసాలా అంతా బంగాళాదుంప ముక్కలకు బాగా పట్టేలా సన్నని మంటపై కొన్ని నిమిషాల పాటు వేయించి కొత్తిమీర కలిపి దింపితే సరిపోతుంది. అంతే ఆలుగడ్డ కారం సిద్ధమవుతుంది.

ఇందులో ఉల్లిపాయలు , పచ్చి మిరపకాయలు వేయకుండా చేయటం వలన ఇది మూడు రోజులైనా పాడు కాదు. పప్పు, సాంబార్, రసం వంటి వాటితో, లేదా నేరుగా తినటానికి కూడా ఈ ఆలుగడ్డ కారం చాలా బాగుంటుంది . బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

కుక్కర్లో పది నిమిషాల్లో కమ్మటి గోధుమ రవ్వ హల్వా!
కుక్కర్లో పది నిమిషాల్లో కమ్మటి గోధుమ రవ్వ హల్వా!

అయితే దీన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి వంటకంలో నూనె పరిమాణాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం మంచిది. ఈ కర్రీని మరింత రుచిగా మార్చేందుకు చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సరికొత్త రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. భలే ఉందని మీరూ తింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+