ఏపీలో యూఏఈ పెట్టుబడులు..! సీఐఐ సదస్సు వేళ చంద్రబాబు చర్చలు..!

ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు (Chandrababu) అంతకు ముందే యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రంగాలపై ఆయనకు చంద్రబాబు వివరించారు. యూఏఈ ఏర్పాటు చేయబోయే ఫుడ్ క్లస్టర్ లో ఆ దేశ కంపెనీలను తీసుకురావాలని మంత్రిని సీఎం కోరారు.

స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!
స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్-యూఏఈ ప్రముఖ కంపెనీలను చంద్రబాబు ఆహ్వానించారు. విశాఖ సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో భేటీ అయిన చంద్రబాబు.. రాయలసీమకు చెందిన ఫలాలు ఇప్పటికే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు ఆయనకు వివరించారు. యూఏఈ ఏర్పాటు చేయనున్న ఫుడ్ క్లస్టర్‌లో ఆ దేశానికి చెందిన అగ్రిఫుడ్ కంపెనీ సిలాల్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఏపీ, వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.

Chandrababu Invites UAE Investments in Andhra Pradesh s Food Processing and Maritime Sectors
ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!
ఏపీ ఉద్యోగులకు రెండో శనివారం సెలవుపై సర్కార్ క్లారిటీ..! నవంబర్ 14న..!

చిత్తూరు జిల్లాలో దుబాయికి చెందిన ఫ్లోర్‌మాస్టర్ పరిశ్రమ గ్రౌండింగ్ విషయం కూడా వీరిద్దరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఫుడ్ క్లస్టర్ లో త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ మంత్రి తౌక్ మర్రిని కోరారు. అలాగే మారిటైమ్, ఏరో స్పేస్, డిఫెన్స్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూఏఈతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుందని చంద్రబాబు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పై యూఈఏ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. సుందరమైన విమానాశ్రయాన్ని ఏపీలో నిర్మించిన సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. భారత తూర్పు తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తిగా ఉందని, తమ దేశ పెట్టుబడులకు ఏపీ కీలక ప్రాంతం అవుతుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+