Viral Video: ఇది పాకిస్థాన్ అనుకున్నావా..? ముస్లిం జంటను వేధించిన కండక్టర్.. కట్ చేస్తే..

కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. రాంగ్ బస్ ఎక్కిన ఓ ముస్లిం జంటపై ఆ బస్సు కండక్టర్ అనుచితమైన, మతపరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కండక్టర్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మన దేశంలో అనేక మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తుంటాయి. అనేక ఆచారాలు, సంస్కృతులకు నిలయంగా భారత్ ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరిని మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. KA-42-F-2253 అనే నెంబర్ గల ఆర్టీసీ బస్సు శివమొగ్గ వైపు వెళ్తోంది. అయితే మౌలానా సాహిబ్ అతని భార్య కేఆర్ పేటె కు వెళ్లాల్సి ఉంది. అయితే వాళ్లు తెలియక రాంగ్ బస్సు ఎక్కారు. వారి తప్పును గుర్తించిన బస్సు కండక్టర్ ఆ ముస్లిం దంపతులుపై సీరియస్ అయ్యాడు. బస్సు బోర్డు చూసుకోకుండా ఎలా ఎక్కారని ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వారిపై మతపరమైన వ్యాఖ్యలు చేశాడు కండక్టర్.

Karnataka bus conductor made religious remarks on Muslim couple the authorities have suspended him

ఇది అఫ్గానిస్తాన్ అనుకున్నావా..? పాకిస్థాన్ అనుకున్నావా..? అంటూ ఆ ముస్లిం దంపతులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు కండక్టర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో బస్సు కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్స్ వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కండక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ అతడ్ని సస్పెండ్ చేశారు. ఇక ప్రయాణికుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో డిబేట్ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+