ముంబై ఇండియన్స్ లో భారీ ప్రక్షాళన..! మలింగ సహా ముగ్గురు అవుట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ (IPL 2026)లో ఎదురైన చేదు ఫలితాలను వచ్చే సీజన్ లో పునరావృతం చేయకుండా ఉండేందుకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈసారి పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జట్టు మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు చేస్తోంది. దీంతో కీరన్ పొల్లార్డ్ ను హెడ్ కోచ్ గా కూడా నియమించుకుంది. పొల్లార్డ్ హెడ్ కోచ్ గా అడుగుపెట్టగానే మేనేజ్ మెంట్ లో తాను కోరిన మార్పుల్ని అమల్లోకి తెచ్చేయడం ప్రారంభించాడు. దీంతో ఇన్నాళ్లూ జట్టును అంటిపెట్టుకుని ఉన్న ఒక్కొక్కరూ బయటికి వెళ్లక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.

Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!
Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లు లసిత్ మలింగ, పరాస్ మ్హాంభ్రే, అలాగే ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్‌లతో తమ బంధాన్ని తెంచుకున్నట్లు యాజమాన్యం ఇవాళ సంచలన ప్రకటన చేసింది. గత వారం హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ ను తీసుకొచ్చిన ముంబై.. ఇప్పుడు కోచ్ లను మార్చే పనిలో పడింది. అంటే పొల్లార్డ్ తన సొంత టీమ్ ను తయారు చేసుకుంటున్నట్లు అర్దమవుతోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ కోచింగ్ విభాగంలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు కోచ్‌ల నిష్క్రమణ భారీ మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.

IPL 2027 Mumbai Indians Release Malinga Mhambrey and Hopkinson After Pollard s Appointment

పురుషుల జట్టు కోచింగ్ విభాగం నుండి లసిత్ మలింగ, పరాస్ మ్హాంభ్రే, కార్ల్ హాప్కిన్సన్‌ తమ పాత్రల నుండి వైదొలుగుతున్నారని ముంబై ఇండియన్స్ ఇవాళ ప్రకటన చేసింది. ఫ్రాంచైజీకి వారు అందించిన నిబద్ధత, సహకారం, సేవలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ కుటుంబంలో ఒక అంతర్భాగం, ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరని ఈ సందర్భంగా ముంబై తెలిపింది. ఎంఐ బౌలింగ్ విభాగానికి సారథ్యం వహించి, నాలుగు ఐపీఎల్ టైటిల్ విజయాలు, 2011 ఛాంపియన్స్ లీగ్ టీ20 విజయంలో కీలక పాత్ర పోషించడం దగ్గరి నుంచి మెంటర్, కోచ్‌గా తిరిగి రావడం వరకు ఎంఐతో లసిత్ ప్రయాణం నిజంగా ప్రత్యేకమైనదని పేర్కొంది.

IPL 2027 Mumbai Indians Release Malinga Mhambrey and Hopkinson After Pollard s Appointment
India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!
India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!

అలాగే పరాస్ మ్హంభ్రే కూడా 2010 నుండి 2017 వరకు, ఆ తర్వాత 2024లో తిరిగి ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘమైన, విలువైన అనుబంధాన్ని పంచుకున్నారని తెలిపింది. ఈ రెండు పర్యాయాలలోనూ, పరాస్ అపారమైన అనుభవాన్ని, అంకితభావాన్ని మరియు MI సంస్కృతిపై లోతైన అవగాహనను తీసుకువచ్చారని ప్రశంసించింది. చివరిగా కార్ల్ హాప్కిన్సన్ 2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో చేరారని, ఇంగ్లాండ్ పురుషుల జట్టుతో గడిపిన కాలం నుండి ఆయనకు విలువైన అంతర్జాతీయ అనుభవం ఉందని, ఫ్రాంచైజీతో ఆయన ఉన్నంత కాలం, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆయన వృత్తి నైపుణ్యం, నైపుణ్యం , నిబద్ధత ఎంతో విలువైనవిగా పరిగణించబడ్డాయని ముంబై ప్రకటనలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+