ముంబై ఇండియన్స్‌లోకి ఎంట్రీ.. ప్రియురాలితో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్!
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో ఒకేరోజు రెండు శుభవార్తలు జరిగాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి ట్రేడ్ ద్వారా మారిన కొద్ది గంటల్లోనే.. ఆయన తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అర్ష్‌దీప్ సింగ్.. అక్కడ మోకాళ్లపై కూర్చొని సమ్రీన్‌కు ఉంగరం తొడిగి ఘనంగా ప్రపోజ్ చేశారు.
ఇన్‌స్టాలో ఫోటోలు వైరల్
ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమ్రీన్ కౌర్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. "జీవితం మనకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక.. మనమిద్దరం కలవడమే. ఇకపై మన జర్నీ జీవితాంత కలిసి సాగుతుంది. హాయ్ ఫియాన్సీ" అంటూ సమ్రీన్ కౌర్ భావోద్వేగమైన క్యాప్షన్ రాసుకొచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ వార్తపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎవరీ సమ్రీన్ కౌర్?
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ ప్రముఖ మోడల్, నటి. ఆమె 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కాశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఫైనలిస్ట్‌గా నిలిచారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం '83'తో ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఐపీఎల్ మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరవుతూ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రోత్సహిస్తున్న సమయంలోనే వీరిద్దరి లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. గత జులైలో అర్ష్‌దీప్ సింగ్ తన సోషల్ మీడియాలో సమ్రీన్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ 'మై పర్సన్' అని రాసుకొచ్చి తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
రికార్డులతో దూసుకెళ్తున్న అర్ష్‌దీప్ సింగ్
27 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ భారత క్రికెట్లో అత్యంత కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. 2018 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించడమే కాకుండా రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులోనూ భాగస్వామిగా ఉన్నాడు.
India pacer Arshdeep Singh proposes his long-time girlfriend Samreen in New Zealand, shares dreamy pictures on Instagram #ArshdeepSingh #SamreenKaur #northeastlive https://t.co/tlpreOqBGY
— Northeast Live (@NELiveTV) November 11, 2026














Click it and Unblock the Notifications
