క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు 14 ఏళ్లపాటు సాగిన తన సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించాడు. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఈ దిగ్గజ ప్లేయర్ నిష్క్రమణతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక అద్భుత శకం ముగిసినట్టయింది. ఫ్రాంఛైజీ లీగ్స్ లల్లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు.

2012లో అరంగేట్రం చేసిన మ్యాక్స్‌వెల్.. ఆస్ట్రేలియా లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లల్లో తిరుగులేని ఆల్ రౌండర్ గా ఎదిగాడు. మ్యాచ్ విన్నర్‌గా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడిగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మ్యాడ్ మ్యాక్సీగా గుర్తింపు పొందాడు. మెరుపువేగంతో ఫీల్డింగ్, అవసరమైన సమయంలో వికెట్లు తీసే ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా 2015, 2023 వన్డే ప్రపంచకప్‌, 2021 టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మ్యాక్స్‌వెల్.

Glenn Maxwell retired from international cricket with all three formats remarkable 14 year career

మ్యాక్స్‌వెల్ కెరీర్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్.. 2023 వన్డే ప్రపంచకప్‌లో నమోదైంది. ముంబై వాంఖడే స్టేడియంలో అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన దశలో మ్యాక్స్‌వెల్. ఆ జట్టుకు విజయాన్ని అందించిన తీరు నభూతో.. అనిపించింది.

ఏపీలో తీరాన్ని తాకిన తుఫాన్- బీభత్సం: అతి భారీ వర్షాలు
ఏపీలో తీరాన్ని తాకిన తుఫాన్- బీభత్సం: అతి భారీ వర్షాలు

కండరాల నొప్పితో విలవిలలాడుతూనే మ్యాక్స్‌వెల్ విరుచుకుపడ్డాడా జట్టు బౌలర్లపై. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో నాటౌట్‌గా 201 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు ఊహించని విజయాన్ని అందించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియా బ్యాటర్ సాధించిన మొట్టమొదటి డబుల్ సెంచరీ అది. ఈ ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ఆ వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణమైంది.

టీమిండియాతో వన్డే సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు డబుల్ బ్లో: ఇద్దరు కీ ప్లేయర్లు అవుట్
టీమిండియాతో వన్డే సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు డబుల్ బ్లో: ఇద్దరు కీ ప్లేయర్లు అవుట్

14 ఏళ్ల కెరీర్‌లో మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున 7 టెస్టులు, 149 వన్డేలు, 130 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 3,990, టీ20ల్లో 2,897, టెస్టుల్లో 339 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 136 వికెట్లు పడగొట్టాడు. వరుస గాయాల కారణంగా గత ఏడాది జూన్‌లో వన్డే క్రికెట్‌కు దూరం అయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒమన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ అతనికి చివరిది అయింది.

క్రికెట్ ఆస్ట్రేలియా 2026-27 సీజన్ కోసం ప్రకటించిన కాంట్రాక్టుల్లో మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది మేలో బంగ్లాదేశ్ పర్యటనకు కూడా ఎంపిక కాలేదు మ్యాక్స్ వెల్. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఫ్రాంచైజీ లీగ్స్ లల్లో కొనసాగనున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఇతర లీగ్ టోర్నీల్లోనూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+