శర్వానంద్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేస్తూ అలరిస్తున్నారు. గతేడాది వరకు సరైన హిట్స్ లేక ఇబ్బందులు ఎదర్కొన్న శర్వానంద్.. ఈ ఏడాది వరుసగా రెండు విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు శర్వా. ఆ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బైకర్ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు 'భోగి' అనే సినిమా చేస్తున్నారు.
'భోగి' చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ మూవీలో శర్వానంద్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అలాగే డింపుల్ హయాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ నవంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఇలా వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఇక ఈ నెల 7 న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో అది కూడా క్యాన్సిల్ అయింది. అప్పటినుంచే సినిమా వాయిదా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటికి చిత్ర యూనిట్ స్పందించలేదు. కానీ తాజాగా మూవీని అధికారికంగా వాయిదా వేస్తూ కీలక ప్రకటన వెల్లడించింది మూవీ టీమ్. కొన్ని ఊహించని కారణాల వల్ల భోగి చిత్రం విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఈ మూవీకి సెన్సార్ బృందం నుంచి ఇబ్బంది తలెత్తుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు అభిమానులు కొత్త విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications
