Ind vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్- హెన్రీ దెబ్బకు 0కే రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ఔట్..!

న్యూజీలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ (India) తీవ్ర కష్టాల్లో పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ విల్ యంగ్ సెంచరీ సాయంతో 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 334 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆరంభ ఓవర్లోనే భారీ షాక్ తప్పలేదు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కొహ్లీతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లనూ డకౌట్లుగా వెనక్కి పంపాడు. దీంతో భారత్ తొలి ఓవర్లోనే 0 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో అసౌకర్యంగా కనిపించారు. తొలి ఓవర్ ప్రారంభించిన మ్యాట్ హెన్రీ పక్కా లైన్ అండ్ లెంగ్త్ తో బంతుల్ని సంధించాడు. దీంతో అనూహ్యంగా బౌన్స్ అవుతూ వచ్చిన బంతి రోహిత్ బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్ లో ఉన్న అలెన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో భారత్ 0 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ స్ధానంలో వచ్చిన విరాట్ కొహ్లీ కూడా మూడు బంతులు అడినా పరుగులు రాబట్టలేకపోయాడు. నాలుగో బంతికి మ్యాట్ హెన్రీ బౌల్డ్ చేయడంతో కొహ్లీ కూడా డకౌట్ గా వెనుదిగిరాడు.

India Lose Rohit Virat and Shreyas to Matt Henry in First Over of Fourth ODI Against New Zealand

కొహ్లీ స్ధానంలో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి బంతికే మ్యాట్ హెన్రీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇన్ స్వింగర్ ను ఆడే క్రమంలో గురి తప్పడంతో బంతి ప్యాడ్లను తాకింది. అయితే అంపైర్ ధర్మసేన నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో కివీస్ బౌలర్లు డీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో ధర్డ్ అంపైర్ రివ్యూలో బంతి నేరుగా వికెట్లను తాకేదని స్పష్టమైంది. దీంతో అయ్యర్ ను అవుట్ గా ప్రకటించారు. ఇలా రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ముగ్గురూ తొలి ఓవర్లలోనే డకౌట్ అయ్యారు. ఆ తర్వాత మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా స్లిప్స్ లో బ్రేస్ వెల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. దీంతో భారత్ 9 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+