దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాను, ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు- తాజా హెచ్చరికలు..!!
ఏపీకి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 15న వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా తీవ్రతరం కావచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కు
ఆక్వాన్ గా పేరు ఖరారు చేసారు. దీంతో.. అధికారులు కీలక సూచనలు చేసారు.
ఏపీకి ఆక్వాన్ తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆర్నాబ్ తుఫాను తరహాలో విరుచుకు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం తో 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. 19 లేదా 20న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో, రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్య్స కారులు వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
మరోవైపు, తెలంగాణలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దట్టమైన పొగమంచుకు అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో.. తుఫాను కదలికలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.













Click it and Unblock the Notifications
