Moral stories: కష్టానికి తగిన ఫలితం: నిరాశను జయించిన యువకుడి కథ

ఒక ఊరి చివర ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ గురువు తన శిష్యులతో కలిసి ఉండేవాడు. ఒకరోజు ఒక యువకుడు ఎంతో నిరాశతో, జీవితంపై విరక్తి చెందిన ముఖంతో ఆ గురువు దగ్గరికి వచ్చాడు. "గురువు గారూ! నేను జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అపజయమే ఎదురవుతోంది. ఎంతో కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు. ఇక నా వల్ల కాదు, ఈ జీవితాన్ని ముగించేద్దాం అనిపిస్తోంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Moral stories: కష్టపడకుండా సంపద కోరుకుంటే ఏమవుతుంది? ఒక గుణపాఠం!
Moral stories: కష్టపడకుండా సంపద కోరుకుంటే ఏమవుతుంది? ఒక గుణపాఠం!

రెండు విత్తనాలు నాటు

గురువు అతని భుజంపై ఆప్యాయంగా చేయి వేసి, "నాయనా, నీ సమస్యకు సమాధానం చెబుతాను. కానీ ముందుగా నాకో చిన్న పని చేసిపెట్టు. ఆశ్రమం వెనుక ఉన్న తోటలో రెండు మొక్కలు నాటాలి" అని చెప్పి, అతనికి రెండు రకాల విత్తనాలు ఇచ్చారు. ఒకటి వెదురు విత్తనం, రెండోది ఫెర్న్అనే ఒక సాధారణ మొక్క విత్తనం. ఆ యువకుడు గురువు చెప్పినట్లే ఆ రెండు విత్తనాలను పక్కపక్కనే నాటి, రోజూ వాటికి నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకోసాగాడు. కొద్ది రోజులకే ఫెర్న్ విత్తనం మొలకెత్తింది. కొన్ని నెలల్లోనే అది ఏపుగా పెరిగి, ఆ ప్రాంతమంతా పచ్చగా, అందంగా కప్పుకుంది. కానీ, వెదురు విత్తనం మాత్రం నేలలోంచి కనీసం మొలక కూడా రాలేదు. ఒక సంవత్సరం గడిచింది. ఫెర్న్ మొక్క మరింత పెద్దదైంది. వెదురు విత్తనంలో ఏమాత్రం కదలిక లేదు.రెండేళ్లు గడిచాయి... మూడేళ్లు గడిచాయి... నాలుగేళ్లు గడిచాయి!

Moral stories: నిజమైన గెలుపు ఎక్కడ ఉంది?
Moral stories: నిజమైన గెలుపు ఎక్కడ ఉంది?
Moral stories The reward for hard work The story of a young man who overcame despair

యువకుడిలో మళ్లీ నిరాశ

నాలుగేళ్లయినా వెదురు విత్తనం ఉన్న చోట కేవలం మట్టి మాత్రమే కనిపిస్తోంది. ఆ యువకుడికి మళ్లీ నిరాశ మొదలైంది. గురువు దగ్గరికి వెళ్లి, "గురువు గారూ! నాలుగేళ్లుగా రోజూ నీళ్లు పోస్తున్నాను, ఎరువు వేస్తున్నాను. ఆ ఫెర్న్ మొక్క ఎంతో అందంగా పెరిగింది. కానీ ఈ వెదురు విత్తనం మాత్రం చనిపోయినట్లుంది, అసలు మొలకెత్తలేదు. నా జీవితం కూడా ఈ వెదురు విత్తనం లాంటిదే" అన్నాడు బాధగా. గురువు చిరునవ్వుతో, "ఇంకొక్క ఏడాది ఓపిక పట్టు నాయనా. నీళ్లు పోయడం మాత్రం ఆపకు" అన్నారు. ఐదో సంవత్సరం వచ్చింది. ఒకరోజు ఉదయం ఆ యువకుడు తోటలోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. నాలుగేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న వెదురు విత్తనం నుంచి ఒక చిన్న మొలక బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన అద్భుతాన్ని చూసి అతను నోట మాట రాక ఉండిపోయాడు. ఆ చిన్న మొలక పెరగడం మొదలుపెట్టిన కేవలం ఆరు వారాల్లోనే ఏకంగా 90 అడుగుల ఎత్తుకు పెరిగిపోయింది.

నీ ఓటమి నిన్ను బలంగా చేస్తుంది

అప్పుడు గురువు ఆ యువకుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు.. "నాయనా, ఈ వెదురు చెట్టు ఆరు వారాల్లో 90 అడుగులు పెరిగిందా? లేక ఐదేళ్లలో 90 అడుగులు పెరిగిందా? నిజానికి ఈ నాలుగేళ్ల పాటు అది భూమి లోపల తన వేళ్లను ఎంతో బలంగా, లోతుగా విస్తరించుకుంటూ ఉంది. ఒకవేళ ఆ వేళ్లు అంత బలంగా లేకపోతే, 90 అడుగుల ఎత్తును అది తట్టుకోలేక కూలిపోయేది. "మన జీవితం కూడా అంతే! నువ్వు కష్టపడుతున్నావు కానీ ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నావు. కానీ గుర్తుంచుకో... నీ ప్రతి ప్రయత్నం, నీ ప్రతి ఓటమి నిన్ను లోపలి నుంచి బలపరుస్తోంది. నీ వేళ్లను దృఢంగా మారుస్తోంది. సమయం వచ్చినప్పుడు నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఫలితం కనిపించడం లేదని నీ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేయకు" అని గురువు బోధించారు. ఆ మాటలతో ఆ యువకుడి కళ్లలో కొత్త వెలుగు కనిపించింది. నిరాశ మబ్బులు తొలగిపోయి, రెట్టించిన ఉత్సాహంతో తన గమ్యం వైపు అడుగులు వేశాడు.

నీతి

మన కష్టానికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఆ సమయంలో మనం నిరాశపడకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తే, మన పునాది మరింత బలపడుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు మన విజయం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+