ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పం.. నడుము వరకు చెక్కాలనుకుంటే ముఖాలే ఎందుకు మిగిలాయి?

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో అమెరికాలోని 'మౌంట్ రష్మోర్' ఒకటి. సౌత్ డకోటాలోని బ్లాక్ హిల్స్ కొండలపై నలుగురు అమెరికా మాజీ అధ్యక్షుల ముఖాలను అత్యంత సహజసిద్ధంగా చెక్కిన తీరు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే ఈ భారీ శిల్పాల వెనుక ఎవరికీ తెలియని ఒక అసంపూర్తి కథ ఉంది. నిజానికి ఈ విగ్రహాలను నడుము వరకు చెక్కాలని ప్లాన్ చేసినా, కేవలం ముఖాలతోనే పనులు ఎందుకు ఆగిపోయాయో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

అసలు ఈ ఆలోచన ఎవరిది? ఎప్పుడు మొదలైంది?

సౌత్ డకోటా ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో 1923లో చరిత్రకారుడు డోన్ రాబిన్సన్ ఈ భారీ శిల్పాల ప్రతిపాదన తెచ్చారు. దీనికోసం ప్రముఖ శిల్పి గట్జోన్ బోర్గ్లమ్‌ను ఎంపిక చేశారు. చట్టపరమైన అనుమతులన్నీ పూర్తయిన తర్వాత 1927లో కొండను చెక్కే పనులు మొదలయ్యాయి. అమెరికా చరిత్రను మలుపుతిప్పిన నలుగురు అధ్యక్షులు.. దేశ వ్యవస్థాపకుడు జార్జ్ వాషింగ్టన్, స్వాతంత్ర్య ప్రకటన రూపకర్త థామస్ జెఫర్సన్, పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన థియోడర్ రూజ్‌వెల్ట్, అంతర్యుద్ధం నుంచి దేశాన్ని కాపాడిన అబ్రహం లింకన్ విగ్రహాలను ఇక్కడ చెక్కాలని నిర్ణయించారు.

Why Mount Rushmore Was Left Unfinished The Hidden History Behind Carving Four US Presidents into Granite Rock

నడుము వరకు చెక్కాలనుకుంటే.. ముఖాలే ఎందుకు మిగిలాయి?

శిల్పి గట్జోన్ బోర్గ్లమ్ ఆలోచన ప్రకారం, ఈ నలుగురు అధ్యక్షుల విగ్రహాలను భుజాలు, చేతులతో సహా నడుము వరకు పూర్తిస్థాయిలో చెక్కాలి. దీనికోసం దాదాపు 400 మందికి పైగా కార్మికులు రేయింబవళ్లు శ్రమించారు. డైనమైట్లతో కొండ రాళ్లను పేల్చి, ఆపై డ్రిల్స్, సుత్తులతో అత్యంత సూక్ష్మంగా శిల్పాలను తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టుకు అప్పట్లోనే దాదాపు 9.90 లక్షల డాలర్లు ఖర్చయింది. విగ్రహాల వెనుక అమెరికా చరిత్రను భద్రపరిచేలా ఒక 'హాల్ ఆఫ్ రికార్డ్స్' కూడా నిర్మించాలని బోర్గ్లమ్ భావించినా, నిధుల కొరత కారణంగా 1939లో ఆ పనిని ప్రభుత్వం నిలిపివేసింది.

ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పట్టణం.. ఇప్పుడు భారత్ లో.. ఎక్కడంటే..?
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పట్టణం.. ఇప్పుడు భారత్ లో.. ఎక్కడంటే..?

శిల్పి మరణం.. రెండో ప్రపంచ యుద్ధం దెబ్బ!

14 ఏళ్ల పాటు సాగిన ఈ మహా యజ్ఞానికి 1941లో రెండు ప్రధాన కారణాలతో బ్రేక్ పడింది. ప్రధాన శిల్పి గట్జోన్ బోర్గ్లమ్ అకస్మాత్తుగా మరణించడంతో, ఆయన కుమారుడు లింకన్ బోర్గ్లమ్ పనుల బాధ్యత తీసుకున్నారు. అయితే, అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అమెరికా ప్రభుత్వం నిధులన్నింటినీ యుద్ధ అవసరాలకే మళ్లించింది. విగ్రహాల నిర్మాణానికి కేటాయించిన డబ్బు పూర్తిగా అయిపోవడంతో, 1941 అక్టోబర్ 31న పనులు పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. అలా నడుము వరకు రావాల్సిన విగ్రహాలు కేవలం ముఖాలతోనే మిగిలిపోయాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద గుహ! తుఫాను ఇచ్చిన అద్భుత కానుక
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ! తుఫాను ఇచ్చిన అద్భుత కానుక

ఆ కొండల వెనుక మరో కోణం.. పర్యాటకుల సందడి

మౌంట్ రష్మోర్ ఉన్న బ్లాక్ హిల్స్ ప్రాంతం అక్కడి స్థానిక 'లకోటా' గిరిజనులకు అత్యంత పవిత్రమైనది. భూ వివాదాలు, ఒప్పందాల ఉల్లంఘనల నడుమ ఈ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి రావడం వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడికి ప్రవేశం పూర్తిగా ఉచితమే అయినప్పటికీ, వాహనాల పార్కింగ్ కోసం సాధారణ వాహనాలకు 10 డాలర్లు (సుమారు రూ.947), సీనియర్ సిటిజన్లకు 5 డాలర్లు (సుమారు రూ.473) వసూలు చేస్తారు. అసంపూర్తిగా మిగిలిపోయినా, నేటికీ అమెరికాకు అత్యంత గుర్తింపు తెచ్చే కట్టడంగా మౌంట్ రష్మోర్ నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+