రైల్వే రిజర్వేషన్ లో దశాబ్దాల విధానం రద్దు, కీలక మార్పులు- బెర్తుల ఖరారు ఇక ఇలా..!!
రైల్వే శాఖ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్దం అవుతోంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు రైలు బయల్దేరే సమయం వరకు ఖరారు అవుతుందో లేదో తెలియక ప్రయాణీకులు టెన్షన్ పడే పరిస్థితి నెలకొంది. కొందరికి ఆర్ఏసీలోకి.. మరి కొన్ని రద్దు చేస్తూ రైలు మరి కొద్ది గంటల్లో బయల్దేరే వేళ ప్రకటిస్తున్నారు. దీంతో, ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలోనే కీలక మార్పులు అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రైలు ప్రయాణీకులకు ఇప్పటి వరకు టికెట్ ఖరారు కాని వారికి చాలా మందికి ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టులో టికెట్లు జారీ అవుతున్నాయి. అయితే.. చాలా మంది ఆర్ఏసీ టికెట్ దొరికినా చాలనుకొని సీటు షేరింగ్ తో సర్దుకు పోతున్నారు. కాగా, ప్రయాణీకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు రైల్వే శాఖ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆర్ఏసీ విధానానికి త్వరలో తెరపడే అవకాశా లు కనిపిస్తున్నాయి.. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ పద్ధతిని పూర్తిగా తొలగించే ఆలోచనలో రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

గతంలో రైల్వే టికెట్ల రిజర్వేషన్లు ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలో జరిగేవి.. ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఖాళీ అయ్యే బెర్తులను ఎప్పటికప్పుడు గుర్తించడం అంత ఈజీ కాదు. దీంతో ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయించేలా ఆర్ఏసీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇద్దరూ ప్రయాణించవచ్చు. ఒకవేళ మరో ప్రయాణికుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, మిగిలిన వారికి పూర్తి బెర్త్ దక్కే అవకాశం ఉంటుంది.
అయితే, ఈ ఆర్ఏసీ విధానం పైన ప్రయాణీకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ లో బెర్తు కోసం పూర్తి ఛార్జ్ వసూలు చేస్తున్నా.. సగం సీటు కేటాయించటం పైన చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఏసీ విధానంలో ప్రయాణీకులు డబ్బులు పూర్తిగా చెల్లించి నా, నిద్రించడానికి మాత్రం సగం స్థలమే ఉండటంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు.
ఒకే సీటును మహిళ, పురుష ప్రయాణికులకు కేటాయించినప్పుడు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ బెర్తులు అడ్జెస్ట్ చేయడం టికెట్ చెకింగ్ చేసే సిబ్బందికి కూడా సవాలుగా మారుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ కూడా ప్రస్తావించింది. ఫుల్ బెర్త్ సౌకర్యం కల్పించకుండా పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై పునఃపరిశీలన చేయాలని సూచించింది. దీంతో, ఈ విధానం రద్దు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన రైల్వే శాఖ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
