రూ. 24.5 కోట్ల విలువైన కొకైన్.. చాక్లెట్స్ లో దాచి.. ఎలా దొరికాడంటే..?
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు. దోహా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు రూ. 24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు అందిన కచ్చితమైన సమాచారం మేరకు.. మంగళవారం విమానాశ్రయానికి చేరుకున్న సదరు ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. అతడి బ్యాగులో ఒక్కొక్కటి 387 గ్రాముల బరువు కలిగిన 7 లిండ్ట్ లిండోర్ డార్క్ చాక్లెట్ల బాక్సులు కనిపించాయి.
అయితే ఈ బాక్సులపై అధికారులకు అనుమానం కలిగింది. అవి సాధారణ పరిమాణం కంటే పెద్ద సైజులో ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా ఆ చాక్లెట్స్ మధ్య దాచి ఉంచి 207 లేత పసుపు రంగు క్యాప్సూల్స్ బయటపడ్డాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా తెల్లని పొడి రూపంలో ఉన్న పదార్థం ఉంది. అయితే నార్కొటిక్ పరీక్షల్లో అది కొకైన్ అని వెల్లడైంది. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ 4.9 కిలోల కొకైన్ విలువ మార్కెట్ లో సుమారు రూ. 24.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంటనే కొకైన్ ను సీజ్ చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు హైదరాబాద్ లో పోలీసులు ఎన్ని కఠిన ఆంక్షలు అమలు చేసినా వివిధ రూపాల్లో అది ఇక్కడి వారికి చేరుతూనే ఉంది. డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ ముఠాల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వాట్సాప్ చాట్స్ లో ఈ డ్రగ్స్ ను కోడ్ భాషల ద్వారా విక్రయం, సరఫరా చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దురంధర్, మీర్జాపూర్, ఎంజాయ్, బ్రో, కాకా తదితర పదాలతో కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications
