ఓటీటీలోకి పక్కా హైదరాబాదీ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్..!
టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న సినిమాలదే హవా కొనసాగుతోంది. గత రెండేళ్లుగా పెద్ద సినిమాల కంటే కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. గతేడాది రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంభాల లాంటి చిన్న సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను చూసిన సంగతి తెలిసిందే. సైలెంట్ గా వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టడం చిన్న సినిమాల స్పెషాలిటీ.. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
పెద్ద పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అవుతున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడూ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'అమీర్ లోగ్'.. పక్కా హైదరాబాద్ సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
మొత్తం పూర్తిగా నూతన నటీనటులతో రూపొందిన అమీర్ లోగ్ మూవీ గత నెల 21 న విడుదలైంది. అయితే మాస్ మహారాజ రవితేజ ఇరుముడి పుణ్యమా అని ఈ మూవీకి బజ్ క్రియేట్ కాలేదు. దాంతో సైలెంట్ గానే థియేటర్ల నుంచి నిష్క్రమించింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలో అలరిస్తుంది. ఇక ఈ మూవీలోని స్టోరీ మొత్తం హైదరాబాద్ లోనే సాగుతుండటం విశేషం.

హైదరాబాద్ లోని ఓ బస్తీ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. లైఫ్ లో ఎలాంటి గోల్స్ లేకుండా జులాయి గా తిరిగే ముగ్గురు ప్రాణ స్నేహితుల కథే ఈ సినిమా .. అలా ఏ పనీ చేయకుండా తిరుగుతూ.. తాగుతూ కాలం వెళ్లదీస్తున్న వీరికి, అదే బస్తీకి చెందిన నజీర్ అనే వ్యక్తితో క్రికెట్ విషయంలో తీవ్రంగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో మా బస్తీ వాళ్లు మీ కంటే క్రికెట్ బాగా ఆడతారని ఛాలెంజ్ చేస్తారు. దాంతో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ లో బస్తీ టీమ్ విజయం సాధించిందా లేదా..? ఈ కథలోకి ఊహించని విధంగా బిర్యానీ కాన్సెప్ట్ ఎలా ప్రవేశించింది..? అనేదే స్టోరీ..












Click it and Unblock the Notifications
