చర్లపల్లి టూ విశాఖ, బ్రహ్మపూర్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
పండుగల సీజన్ లో తెలుగు రాష్టాల్లో రాకపోకలు సాగించే రైళ్లలో రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నా, గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే తాజాగా మరో నాలుగు ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. చర్లపల్లి నుంచి ఏపీతో పాటు ఒడిశా వరకూ రాకపోకలు సాగించేలా వీటిని ప్రకటించారు.
దసరా, దీపావళి, ఛఠ్ పండుగలతో పాటు రానున్న శీతాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వేలోని విజయవాడ డివిజన్ ఇవాళ ఓ ప్రకటన చేసింది. ఇందులో చర్లపల్లి-బ్రహ్మపూర్ మధ్య ఓ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. రైలు నంబర్ 07027 చర్లపల్లి నుంచి బ్రహ్మపూర్కు ప్రతి శుక్రవారం నడుస్తుందని తెలిపింది. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే రైలు నంబర్ 07028 బ్రహ్మపూర్ నుంచి చర్లపల్లికి ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ సర్వీస్ అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు కొనసాగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లకు రెండు వైపులా నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ జంక్షన్, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టాపులు ఇచ్చారు. అలాగే చర్లపల్లి నుంచి విశాఖ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. రైలు నంబర్ 07067 చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ప్రతి గురువారం నడుస్తుంది. ఈ సర్వీస్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రైలు నంబర్ 07068 విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ సర్వీస్ అక్టోబర్ 2న ప్రారంభమవుతుంది. ఈ రెండు రైళ్లకూ రెండు వైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టాపులు ఇచ్చారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లలోనూ 3 టూటైర్ ఏసీ, 5 త్రీటైర్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.














Click it and Unblock the Notifications
