Irumudi: ఇరుముడి నయా రికార్డు.. రవితేజ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజా?
Irumudi OTT Record: మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి'సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ తన హవాను కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా తండ్రి-కూతురు అనుబంధం, కుటుంబ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలో ఇరుముడి నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?
నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ నంబర్ 1
సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇరుముడి' మూవీ మొదటి వారంలోనే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాన్-ఇంగ్లిష్ సినిమాల గ్లోబల్ టాప్-10 జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ మూవీ. అయితే రెండో వారంలోనే ఈ ఘనత సాధించింది.సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు నమోదైన వ్యూస్ తో ఏకంగా నంబర్ వన్ ప్లేస్ లో నిలించింది ఇరుముడి మూవీ. గత వారంలో మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా.. రెండో వారానికి వచ్చేసరికి రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో సూర్య 'విశ్వనాథ్ & సన్స్' సినిమాను కూడా వెనక్కి నెట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మూవీస్ చార్ట్‌లోనూ 'ఇరుముడి' నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

రెండు వారాల్లోనే 6.8 మిలియన్ వ్యూస్
'ఇరుముడి'కి వచ్చిన వ్యూస్ సంఖ్య కూడా ఆసక్తికరంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 3.4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంటే సుమారు 34 లక్షల వ్యూస్ కేవలం మూడు రోజుల్లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మరో 3.4 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో రెండో వారాంతానికి సినిమా మొత్తం వ్యూస్ 6.8 మిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో గ్లోబల్ నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం 'ఇరుముడి'కి ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది.
తెలుగు సినిమాల్లో టాప్-5లో చోటు
నెట్‌ఫ్లిక్స్‌లో 2024 తర్వాత విడుదలైన తెలుగు సినిమాల సెకండ్ వీక్ వ్యూస్‌ను పరిశీలిస్తే 'ఇరుముడి' 6.8 మిలియన్లతో టాప్-5లో చోటు దక్కించుకుంది. 6.9 మిలియన్ వ్యూస్‌తో 'హిట్ 3'కి చాలా దగ్గరగా ఉంది. 'కల్కి 2898 ఏడీ' హిందీ వెర్షన్ 7.1 మిలియన్ వ్యూస్‌తో ముందుంది. ఇక 'లక్కీ భాస్కర్' 11.7 మిలియన్, 'పుష్ప 2' 9.4 మిలియన్ వ్యూస్‌తో టాప్ 1,2 స్థానాల్లో ఉన్నాయి. అంటే కేవలం రెండు వారాల వ్యవధిలోనే 'ఇరుముడి' నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వ్యూస్ సొంతం తెలుగు సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఆల్‌టైమ్ టాప్-10లోకి వెళ్తుందా?
ఇక 'ఇరుముడి' ముందున్న ఓ టార్గెట్ ఉంది.అత్యధిక వ్యూస్ అందుకున్న తెలుగు సినిమాల ఆల్‌టైమ్ జాబితాలో చోటు సంపాదించడం. గణాంకాల ప్రకారం టాప్-10లో చివరి స్థానంలో 'కల్కి 2898 ఏడీ' హిందీ వెర్షన్ సుమారు 13 మిలియన్ వ్యూస్‌తో ఉంది. ప్రస్తుతం 'ఇరుముడి' 6.8 మిలియన్ వ్యూస్ వద్ద ఉంది. ఈ స్థాయిని అందుకోవాలంటే మరో 6.2 మిలియన్ వ్యూస్ అవసరం. అయితే 'ఇరుముడి' ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండటంతో రాబోయే వారాల్లో మరిన్ని వ్యూస్ చేరే అవకాశం ఉంది. ఇక మూడో, నాలుగో వారాల్లో ఈ సినిమా ఎన్ని వ్యూస్ సాధిస్తుంది? ఆల్‌టైమ్ టాప్-10లోకి అడుగుపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
















Click it and Unblock the Notifications
